
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగర సుందరీకరణలో భాగంగా ఖైరతాబాద్ జోన్లో కూడళ్ల అభివృద్ధి పనులను మేయర్ గద్వాల విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి సోమవారం ప్రారంభించారు. అబిడ్స్ జీపీఓ జంక్షన్లో రూ.49 లక్షలతో మరమ్మతులు, గోడలపై థీమ్ పెయింటింగ్, గన్ పార్క్ వద్ద డిజిటల్ వాటర్ ఫౌంటెన్, గన్ ఫౌండ్రీ ఐలాండ్‌లో రూ.50 లక్షలతో ల్యాండ్ స్కేపింగ్, కేబీఆర్ పార్క్‌లో అర్బన్ వాటర్ ఫాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. డిజిటల్ మెకానిజంతో కూడళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, పర్యాటకులను ఆకట్టుకునేలా నగరాన్ని సుందరంగా మారుస్తామని తెలిపారు.