రంగు రంగుల రమ్యమైన గాజులు

రంగు రంగుల రమ్యమైన గాజులు

మహిళలకు గాజులంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఎన్ని చూసినా తనివితీరదు.  డ్రెస్ కి మ్యాచింగ్ అయ్యే వాటికోసం బ్యాంగిల్స్ స్టోర్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే మోడల్స్ కొనేందుకు చాలా ఇంట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపుతారు. ఫంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , పండుగ ఏదైనా మహిళలకు చేతుల నిండా గాజులు ఉండాల్సిందే. లాడ్ బజార్  అంటే గాజులకు కేరాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  ప్రస్తుతం రంజాన్ మాసం సందర్భంగా ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిటీలో పండుగ సందడి మొదలవగా మహిళలతో  కిటకిటలాడుతున్నాయి. డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజైన్లు, వైరెటీస్ షాపుల్లో కనువిందు చేస్తున్నాయి. అన్ని రకాల గాజులు అందుబాటులో లభిస్తాయి. దేశ విదేశాల నుంచి కేవలం లాడ్ బజార్ గాజుల కోసమై సిటీకి వచ్చేవారు కూడా ఉంటారు.    లాడ్ బజార్ నిత్యం సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. మామూలు రోజులతో పోలిస్తే ప్రస్తుతం షాపుల్లో సందడి నెలకొంది.

విభిన్న వెరైటీల్లో..

లక్క గాజులు మొదలు నేటితరం మగువలు ఇష్టపడే అన్ని రకాలు కొలువుదీరి ఉన్నాయి. విభిన్న రకాల మెటల్స్ తోనూ సందడి చేస్తున్నాయి. స్టోన్ బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్, ముత్యాల గాజులు, పూసల గాజులు, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, కంగన్ లు, మెటల్ విత్ థ్రెడ్ బ్యాంగిల్స్, మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలర్ బ్యాంగిల్స్, స్టోన్ విత్ సాదా బ్యాంగిల్స్ ఇలా వివిధ రకాల మార్కెట్ లో లభిస్తున్నాయి. ధరలు కూడా రీజనబుల్ గా ఉండటంతో అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.