
పా దాలు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పెడిక్యూర్ తప్పనిసరి. దీనికోసం పార్లర్ కు వెళ్లాల్సిన పనిలేదు. వంటింట్లో అందుబాటులో ఉండే పదార్థాల తోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. అదెలాగంటే...
పెడిక్యూర్ కోసం ముందుగా గోళ్లకున్న నెయిల్ పాలిష్ ను పూర్తిగా తీసేయాలి. ఆ తరువాత గోళ్లని మంచి షేప్ లో కట్ చేయాలి. ఇప్పుడు టబ్బు సగం వరకు గోరువెచ్చని నీళ్లు పోసి అందులో కొద్దిగా షాంపూ, రాళ్ల ఉప్పు, రోజ్ వాటర్, గుండ్రంగా తరిగిన నిమ్మకాయ ముక్కలు వేయాలి. ఆ నీళ్ల వేడి తగ్గేవరకు పాదాల్ని అందులో ఉంచి.. తరువాత బయటకు తీయాలి.
ALSO READ : వానల్లో మొక్కల కేర్.. ఇలా కాపాడుకుంటే సురక్షితంగా ఉంటాయి..
తడి పూర్తిగాపోయాక పాదాలపై మృతకణాలు తొలగిం చడానికి రెండు టీ స్పూన్ల చక్కెర, రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పొడి, రెండు టీ స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా ఆలివ్ నూనె తీసుకుని బాగా కలిపి ప్యాక్ లా వేసుకోవాలి. పూర్తిగా ఆరాక పాదాల్ని కడిగేయాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుని నచ్చిన నెయిల్ పాలిష్ వేసుకుంటే ఇంట్లోనే పెడిక్యూర్ పూర్తయినట్లే. ఇదే పద్ధతిలో మెనిక్యూర్ కూడా చేసుకోవచ్చు.