హైదరాబాద్ కు తరలి వస్తున్న అందగత్తెలు

హైదరాబాద్ కు  తరలి వస్తున్న అందగత్తెలు

సిటీ వేదికగా జరుగుతున్న మిస్ ​వరల్డ్​ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి అందగత్తెలు తరలి వస్తున్నారు. బుధవారం మిస్​ లాట్వియా మరిజా ఎలిజిబెత్​మిసురోవా, మిస్ కజకిస్తాన్​ సబినా ఇడ్రోస్సోవా, మిస్​ సింగపూర్​ డెల్వినా కత్రీనా కె లాతూర్, మిస్​ డెన్ మార్క్​ ఎమ్మా హెస్ట్​థామ్సన్, మిస్​ మంగోలియా ఎర్డన్స్​వుడ్​బట్​బయార్, మిస్ ​నికరాగ్వా రోడ్రిగ్యుజిలేగు వేర్వేరు ఫ్లైట్లలో శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు చేరుకోగా అధికారులు ఘన స్వాగతం పలికారు. 

 ఆపరేషన్​ సిందూర్ ​నేపథ్యంలో ఎయిర్​పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే వివరాలు తెలుసుకుంటున్నారు. మిస్​ వరల్డ్​ పోటీదారులను సిటీకి తీసుకెళ్తున్న వెహికల్స్​ డ్రైవర్లకు డ్రంకెన్​ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.

– వెలుగు, శంషాబాద్