
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎన్నో రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. మారుతున్న వాతావరణం వల్ల వచ్చే జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. చుండ్రు చిన్న సమస్యగా అనిపించినా.. దీనివల్లే జుట్టంతా ఊడిపోయి బట్టతల వస్తుంది. జుట్టు పల్చగా అవుతుంది. వెంట్రుకలు బలం కోల్పోతాయి.అలాగే నెత్తికి సంబంధించిన ఎన్నో సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం...
ఇలా చేస్తే చుండ్రు మాయం
రోజూ షాంపూతో తలస్నానం చేసినా చుండ్రు సమస్య మాత్రం వదలదు చాలాసార్లు. తలలో చుండ్రుకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రధాన కారణమైనప్పటికీ... ఇతర కారణాలు కూడా ఉంటాయి. వాటిలో కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, శుభ్రత పాటించకపోవడం వంటివి ప్రధానం. మెడికేటెడ్ షాంపూల అవసరం లేకుండానే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే చుండ్రు సమస్య దూరం చేసుకోవచ్చు.
- వారంలో రెండు రోజులు ఆలివ్ నూనెతో తలను మర్దన చేసుకోవాలి. ఆలివ్ నూనెలో సహజ సిద్ధంగా చుండ్రును తొలగించే గుణాలున్నాయి. రాత్రి నిద్రపోయే ముందు ఆలివ్ నూనెను తలకు పట్టించి తలకు తుండు లేదా స్కార్ఫ్ కట్టుకోవాలి. ఇలా చేస్తే నూనె బాగా తలలోకి ఇంకుతుంది.
- నిమ్మ ఆకులను అరగంట పాటు నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ ఆకులను పేస్ట్ చేసి తలకు పట్టించాలి.. ముప్పావుగంట తరువాత పట్టి నీళ్లతో జుట్టు శుభ్రం చేయాలి.
- కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి చుండ్రును సమర్ధవంతంగా తొలగిస్తాయి. తలకు కలబంద గుజ్జు పట్టించి ముప్పావు గంట తరువాత నీళ్లతో కడిగేస్తే చుండ్రు సమస్య దూరం అవుతుంది..
- మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. వారానికి ఒకసారి చొప్పున నెల రోజులు ఇలా చేస్తే చుండ్రు మరిక కనిపించదు.
వెలుగు, లైఫ్