Beauty Tips: వారెవ్వ.. ఫ్రూట్స్ తో ఆరోగ్యమే కాదు.. అందం కూడా వస్తుంది.. ఎలాగంటే..!

Beauty Tips:  వారెవ్వ.. ఫ్రూట్స్ తో ఆరోగ్యమే కాదు.. అందం కూడా వస్తుంది.. ఎలాగంటే..!

 పండ్లు  ఆరోగ్యమే కాదు.. అందం కూడా ఇస్తాయి .  పండ్ల చికిత్స అంటే పండ్లను ఫేషియల్ మాస్క్‌లుగా లేదా ఆహారంలో భాగంగా ఉపయోగించడం. దీనివల్ల చర్మం తేమగా, ప్రకాశవంతంగా మారడంతో పాటు, మచ్చలు, ముడతలు తగ్గి మెరుగుపడుతుంది.

 కమలా వంటి సిట్రస్ పండ్లలోని విటమిన్ సి జిడ్డుగల చర్మానికి, బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్ చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడతాయి. ఇంకా యాపిల్​..అరటి పండ్లు కూడా ఎంతో అందాన్ని ఇస్తాయి. 

  • రోజుకో యాపిల్ తింటే డాక్టర్​కే కాదు, బ్యూటీషియన్​ కు  కూడా దూరంగా ఉండొచ్చు. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సెల్స్​ ని , టిష్యూస్​ ని డ్యామేజ్ అవకుండా కాపాడతాయి. అందుకే తప్పకుండా యాపిల్​ ను  తినాలి. దీని జ్యూస్​ లో  తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతమవుతుంది.
  • బొప్పాయిలో పపెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్​ ను  తొలగిస్తుంది. బొప్పాయిని పేస్ట్ చేసి తేనె కానీ పెరుగు కానీ కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుస్తుంది.
  • అరటిపండ్లలో ఉండే ఫైబర్,మినరల్స్, మెగ్నీషియం. పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపర్చడమే కాక రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. వీటిలో ఉండే ఎ,బి,ఇ విటమిన్లు యాంటీ ఏజింగ్ ఏజెంట్ లా పని చేస్తాయి. అందుకే తినడంతో పాటు తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే మంచిది.
  • కమలాఫలాల్లో ఉండే విటమిన్ -సి చర్మానికి కాంతినిస్తుంది. మచ్చల్ని పోగొడుతుంది. వీటి తొక్కల్ని ఎండబెట్టి, పొడి చేసి, నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా అవుతుంది.

వెలుగు, లైఫ్​