టీచర్ పోస్టులు పెంచాలి..లేదంటే..సర్కారుకు డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల వార్నింగ్

టీచర్ పోస్టులు పెంచాలి..లేదంటే..సర్కారుకు డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల వార్నింగ్

హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. టీచర్ పోస్టుల సంఖ్యను తగ్గించారంటూ డీ.ఎడ్.. బీ.ఎడ్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. దీంతో లక్డీకపూల్ మెట్రో స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.

అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం 13వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని... అభ్యర్థుల డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులను పెంచాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో 13,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే.. కేవలం 5వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ రిలీజ్ చేశారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోస్టులను పెంపుపై నిర్ణయం తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. 

ప్రభుత్వం దీనిపై స్పందించే వరకు నిరసనను ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అభ్యర్థలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో డీ.ఎడ్.. బీ.ఎడ్ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమపై పోలీసులు దాడి చేశారని అభ్యర్థుల ఆరోపణలు చేశారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం దగ్గరకు డీ.ఎడ్.. బీ.ఎడ్ అభ్యర్థులు విడతల వారిగా వస్తున్నారు. ధర్నాకు వచ్చిన అభ్యర్థులను వచ్చినట్టే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.