OTTలోకి సూపర్ హిట్ బెదురులంక.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

OTTలోకి సూపర్ హిట్ బెదురులంక.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మికొండ(Karthikeya Gummikonda) హీరోగా వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ బెదురులంక 2012(Bedurulanka2012). కొత్త దర్శకుడు క్లాక్స్(Clax) తెరకెక్కించిన ఈ సినిమాలో డీజీ టిల్లు ఫేమ్ నేహా శెట్టి(Neha shetty) హీరోయిన్ గా నటించింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో చాలా కాలంగా సరైన హిట్టు కోసం చూస్తున్న హీరో కార్తికేయకు బూస్టింగ్ హిట్ పడింది. 

ఇక తాజాగా ఈ బెదురులంక 2012 థియేట్రికల్ రన్ ముగించికోసవడంతో.. ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధం చేశారు మేకర్స్. ఈ మేరకు అఫిషియల్ అనౌన్సమెంట్ కూడా ఇచ్చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్ 22 నుండి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.దీంతో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా ఆడియన్స్ ఓటీటీలో చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి థియేటర్ లో సూపర్ హిట్ గా నిలిచినా ఈ సినిమా ఓటీటీలో ఎలాంటిది రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి మరి.