యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్ తోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ బీర్ల అయిలయ్య అన్నారు. పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శనివారం తుర్కపల్లి మండలంలోని గంధమల్ల, వీరారెడ్డిపల్లి, తిరుమలాపూర్, వాసాలమర్రి, కొండాపూర్, గోపాల్ పూర్, నాగాయపల్లి, మాదాపూర్, ధర్మారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్య మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.
