హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజాపాలన 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా బుధవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో బెగ్గర్స్ రిహాబిలిటేషన్ నిర్వహించారు. నాంపల్లి , కాచిగూడ రైల్వే స్టేషన్, కేబీఆర్ పార్క్, అంబర్పేట్ చౌరస్తా, అమీర్‌పేట్ చౌరస్తా, బల్కంపేట్ టెంపుల్ పరిసరాలు, నానల్‌నగర్, ఆరాంఘర్ చౌరస్తాల్లో ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా 107 మంది బిచ్చగాళ్లను గుర్తించారు.
37 మందిని చౌటుప్పల్ సమీపంలోని అమ్మా-నాన్న అనాథాశ్రమానికి, మరో 40 మందిని జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ షెల్టర్ హోమ్స్‌లో చేర్పించారు. మిగతా వారిని కౌన్సిలింగ్ చేసి స్వస్థలాలకు పంపించారు. పీఓలు, సీఓలు, పోలీసులు, ఎన్జీఓలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

