
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోఇవాళ్టి( సోమవారం, జూన్-8) నుంచి దైవ దర్శనాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆలయ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు, స్థానికులకు అవకాశం కల్పించారు. రేపటి(మంగళవారం) నుంచి అందరికీ దర్శనాలకు ఏర్పాట్లు చేయనున్నారు. మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు ఆలయ సిబ్బంది. లడ్డు ప్రసాద కౌంటర్ల దగ్గర తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయం లోపల తీర్థ ప్రసాదాలను నిషేధించారు. చిన్నపిల్లలు, వృద్ధులు దర్శనాలకు రావొద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. కొండపైకి వాహనాలకు పర్మిషన్ ఇవ్వలేదు. థర్మల్ స్క్రీనింగ్ టెస్టుల తర్వాతనే భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు.