Ramya Krishnan, RGV: ‘భూత్‌ పోలీస్‌ స్టేషన్‌’లో‌ రమ్యకృష్ణ.. వరుస ఫోటోలతో హీట్ పెంచుతున్న ఆర్జీవీ

Ramya Krishnan, RGV:  ‘భూత్‌ పోలీస్‌ స్టేషన్‌’లో‌ రమ్యకృష్ణ.. వరుస ఫోటోలతో హీట్ పెంచుతున్న ఆర్జీవీ

విలక్షణ దర్శకుడు ఆర్జీవీ తన కొత్త సినిమా పనిలో బిజీలో ఉన్నారు. ‘పోలీస్‌‌ స్టేషన్‌‌ మే భూత్‌‌’ పేరుతో ఆర్జీవీ తనకు అచ్చొచ్చిన హారర్ థ్రిల్లర్ జోనర్లో మూవీ తెరకెక్కిస్తున్నారు. అంటే 'పోలీస్ స్టేషన్‌లో దెయ్యం' అని అర్ధం. ఇలా టైటిల్కి తగ్గట్టుగానే ‘యూ కాంట్‌‌ అరెస్ట్‌‌ ది డెడ్‌‌’ అనే క్యాప్షన్‌‌ తో ఆర్జీవీ తన మార్క్ చూపించే ప్రయత్నం చేయబోతున్నారు.

ఇందులో బాలీవుడ్‌‌లో పవర్‌‌‌‌హౌస్ ఫెర్ఫార్మర్‌‌‌‌గా పేరుగాంచిన మనోజ్ బాజ్‌‌పాయ్ లీడ్ రోల్ చేస్తున్నారు. జెనీలియా కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే, మనోజ్ బాజ్‌‌పాయ్ లుక్ రివీల్ చేసి, సినిమాపై హార్రర్ ఫియర్ తీసుకొచ్చారు.

ఈ క్రమంలో లేటెస్ట్గా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు. ఇవాళ సోమవారం (నవంబర్ 3న) రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. నుదిటిన చుక్కల తిలకం, భయంకరమైన కాటుక కళ్లు, డిఫరెంట్ జ్యువెలరీతో జుట్టు విరబూసుకుని రమ్యకృష్ణ హారర్ లుక్‌లో భయపెట్టిస్తుంది. అయితే, ఇందులో ఆమె రోల్ ఏంటనేది మాత్రం ఆర్జీవీ రివీల్ చేయలేదు. అయితే, పోస్టర్ గమనించి చూస్తే, దెయ్యాల సినిమాగా వస్తున్న ‘పోలీస్‌‌ స్టేషన్‌‌ మే భూత్‌‌’ లో రమ్యకృష్ణ 'మాంత్రికురాలి' పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. 

‘పోలీస్‌‌ స్టేషన్‌‌ మే భూత్‌‌’ గురించి:

ఓ భయంకరమైన గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ను.. పోలీస్‌‌ ఆఫీసర్‌‌‌‌ ఎన్‌‌కౌంటర్‌‌‌‌ చేయగా, రివేంజ్‌‌ తీర్చుకోవడానికి అతను దెయ్యంలా తిరిగొస్తే ఏం జరిగింది అనేది ఈ సినిమా మెయిన్‌‌ కాన్సెప్ట్‌‌ అని వర్మ ప్రకటించారు. అంటే, సాధారణంగా.. మనం భయపడినప్పుడు పోలీసుల వద్దకి వెళ్తాం. మరి పోలీసులే భయపడితే ఎక్కడికి వెళ్తారు? అనే ఆసక్తికరమైన ప్రశ్న చుట్టూ ఈ కథ ఉంటుందని ఆర్జీవీ తెలిపారు. ఇలా కథాంశమే ఇంట్రెస్టింగ్గా ఉండటంతో.. ఈ హారర్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 

రామ్ గోపాల్-మనోజ్ బాజ్‌‌పాయ్:

'సత్య', 'శూల్', 'కౌన్', 'దౌడ్', 'సర్కార్ 3' వంటి ఎన్నో సినిమాల్లో పనిచేశారు. ముఖ్యంగా 'సత్య'లో మనోజ్ బాజ్‌పాయ్ పోషించిన భికు మత్రే పాత్ర సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ పాత్ర మనోజ్ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.

►ALSO READ | Pankaj Tripathi: బాలీవుడ్ స్టార్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం

ఇకపోతే, ఈ సినిమాతో వర్మ తన పాత ఫామ్‌ను తిరిగి అందుకుని, హారర్ థ్రిల్లర్ జానర్‌లో మరో విజయాన్ని సాధిస్తారని సినీ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త మనోజ్ బాజ్‌పాయ్, వర్మ అభిమానుల్లో తీవ్ర ఉత్సుకతను పెంచింది.