తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కోడిశెలకు చెందిన గర్భిణి యాప శిరీషకు పురిటి నొప్పుల రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆశా వర్కర్ కు సమాచారమిచ్చారు. ఆశా వర్కర్ గర్భిణి ఇంటికొచ్చి పరీక్షించి 108 ద్వారా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కాగా అప్రమత్తమైన ఈఎన్టీ యుగంధర్, పైలెట్ రాజు ఆశా వర్కర్ సహాయంతో అంబులెన్స్ లోనే ప్రసవం చేశారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండగా, వారిని గోవిందరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వారు తెలిపారు.
