సంగెం గ్రామంలో గుప్త నిధుల కలకలం

సంగెం గ్రామంలో గుప్త నిధుల కలకలం

తుంగతుర్తి, వెలుగు: మండల పరిధిలోని సంగెం గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ఆదివారం గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. గ్రామంలోని సమాధుల వద్ద రెండు రాతి గుండ్ల మధ్యలో వ్యక్తులు నిమ్మ కాయలు కోసి, కొబ్బరికాయలు కొట్టి, పసుపు కుంకుమ చల్లి పూజలు చేసిన తర్వాత తవ్వకాలు జరిపినట్లు ఆరోపించారు. సుమారు నాలుగు అడుగుల లోతు గుంతను తవ్వారు. అధికారులు, పోలీసులు విచారణ చేపట్టి తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.