- ఏసీపీ రవీందర్ రెడ్డి
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ రవీందర్ రెడ్డి సూచించారు. ఆదివారం చిన్నకోడూరు మండలంలోని మాచపూర్, విటలాపూర్ గ్రామాల మధ్య పులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించడంతో ఆయన వెంటనే ఎస్ ఐ చంద్రమోహన్ తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఆయన మాట్లాడుతూ పులి సంచారం నేపథ్యంలో మాచపూర్, విటలాపూర్, రంగయపల్లి, ఎల్లాయపల్లి గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి సమయాల్లో పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, కనీసం ముగ్గురు, నలుగురు కలిసి గుంపులుగా వెళ్లాలని సూచించారు. పులి కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు.
