అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: జిన్నారం మున్సిపాలిటీకి చెందిన 5వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శిల్పా, ఆమె భర్త నాగరాజు ఆదివారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వీరికి పార్టీ కండువా వేసి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు 8మంది, ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లతో కలిపి బీఆర్ఎస్ బలం 10కి చేరుకుంది. గూడెం మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
