కేపీహెచ్‌‌బీ కాలనీ లో ఓ బిల్డింగ్‌‌ లో దీపం అంటుకుని అగ్నిప్రమాదం

కేపీహెచ్‌‌బీ కాలనీ లో ఓ బిల్డింగ్‌‌ లో దీపం అంటుకుని అగ్నిప్రమాదం

కూకట్‌‌పల్లి, వెలుగు: కేపీహెచ్‌‌బీ కాలనీలో ఓ బిల్డింగ్‌‌లో అగ్నిప్రమాదం జరిగింది. మహా శివరాత్రి సందర్భంగా ఇంటి యజమానులు నూనె దీపాలు వెలిగించి గుడికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. 

కేపీహెచ్‌‌బీ మూడో రోడ్డులోని ఎల్‌‌ఐజీ–412 బిల్డింగ్ నాలుగో అంతస్తులో నివసిస్తున్న కుటుంబం ఆదివారం రాత్రి 9 గంటలకు గుడికి వెళ్లింది. గాలికి దీపాలు ఇతర వస్తువులకు అంటుకుని మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫైర్​ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు.