మెదక్, పాపన్నపేట, వెలుగు: ఒకే ఇంట్లో ముగ్గురికి ఉద్యోగాలు రావడం అరుదు. అదీ అందరికీ ఒకే డిపార్ట్మెంట్ లో ఉద్యోగం లభించడం ఇంకా అరుదు. అలా వచ్చినా ఒక్కొకరు ఒక చోట విధులు నిర్వర్తిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఆ ముగ్గురు ఒకే చోట డ్యూటీ చేస్తే.. అలాంటి. అరుదైన సందర్భానికి ఏడుపాయల జాతర వేదికైంది.
మెదక్ పట్టణానికి చెందిన కానిస్టేబుల్ గంగమణి తూప్రాన్ లో షీ టీమ్ లో పని చేస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ అయిన ఆమె కొడుకు నవీన్ చంద్ర కామారెడ్డి జిల్లా జుక్కల్ పీఎస్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. గంగ మణి కూతురు శ్రీజ మెదక్ రూరల్ పీఎస్లో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. మహా శివరాత్రి జాతర సందర్భంగా వారు ముగ్గురికి ఏడుపాయల్లో బందోబస్తు డ్యూటీ పడింది. ఇలా తల్లీ, కొడుకు, కూతురు ముగ్గురు ఒకే చోట విధులు నిర్వహించడం విశేషం.
