ఇరుకోడు గ్రామ శివారులో ఘటన కనిపించకుండా పోయి శవమయ్యాడు..

ఇరుకోడు గ్రామ శివారులో ఘటన కనిపించకుండా పోయి శవమయ్యాడు..

సిద్దిపేట రూరల్, వెలుగు: ఈ నెల 10 నుంచి కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి శవమై కనిపించిన ఘటన మండల పరిధిలోని ఇరుకోడు గ్రామ శివారులో జరిగింది. ఎస్ఐ రాజేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలగోని సాయికుమార్ (39) ప్రైవేటు జాబ్ చేస్తూ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో గ్రామంలో ఇల్లు నిర్మిస్తున్నాడు. నిర్మాణానికి సంబంధించి ఖర్చులతో పాటు, పాత అప్పుల విషయంలో మానసికంగా ఇబ్బందిపడుతున్నాడు. ఈ నెల 10న ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

కుటుంబ సభ్యులు అదే రోజు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఆదివారం గ్రామ శివారులో ఓ చెట్టుకు సాయి కుమార్ ఉరి వేసుకుని ఉన్న విషయాన్ని  గ్రామస్తులు తెలపడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇంటి నుంచి వెళ్లిన రోజే ఉరి వేసుకుని ఉంటాడని ఎస్ఐ తెలిపారు. మృతిడి తల్లి లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.