మక్తల్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం గుడెబల్లూరు నుంచి జడ్చర్ల వరకు నాలుగు లైన్ల రోడ్డుకు రూ.3,175 కోట్లు మంజూరు చేయడం పట్ల మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి పక్షాలు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 60 నుంచి 70 సార్లు వెళ్లడంతో ఫలితం ఏంటని విమర్శించారని, ఆ ఫలితమే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మంజూరు చేసిన ఈ నాలుగు లైన్ల రోడ్డు అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రోడ్డు పనులు ప్రారంభం కానున్నయని తెలిపారు.
నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పేరు మార్చి మక్తల్-, నారాయణపేట, -కొడంగల్ ఎత్తిపోతల పథకంగా గజిట్ లో చేర్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బాలకృష్ణ రెడ్డి, రవికుమార్ యాదవ్, కట్ట సురేశ్‌కుమార్, కోళ్ల వెంకటేశ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
