హైదరాబాద్లో చంద్రబాబు ర్యాలీ.. కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్లో చంద్రబాబు ర్యాలీ.. కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్ లో చంద్రబాబు ర్యాలీ నిర్వహించడంపై కేసు నమోదు చేశారు బేగంపేట పోలీసులు. నవంబర్ 1న రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి  జూబ్లీహిల్స్ లోని తన నివాసం వరకు చంద్రబాబు ర్యాలీతో వచ్చారు.  అయితే అనుమతి లేకుండా  ర్యాలీ నిర్వహించారని ఎస్సై జయచందర్ ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. 

బేగంపేట  ఎయిర్ పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ లో  చంద్రబాబు ఇంటి  వరకు ర్యాలీ తీశారని ఫిర్యాదు చేశారు.  రెండు గంటల పాలు రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో   ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. సుమారు 50 బైకులు, 20 కార్లతో పాటు  400 మంది ర్యాలీలోని పాల్గొన్నారని పేర్కొన్నారు పోలీసులు.  ర్యాలీ నిర్వహించిన  హైదరబాద్ సిటీ టీడీపీ జనరల్ సెక్రటరీ జీవీజీ నాయుడు సహా పలువురిపై ఐపీసీ సెక్షన్ 341,290,341 ,21r/w76CP కింద  పోలీసులు కేసు నమోదు చేశారు. 

స్కిల్ స్కాం కేసులో 53  రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులోఉన్న  చంద్రబాబుకు అనారోగ్యం కారణంగా ఏపీ హైకోర్టు అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ పై విడుదలైన ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఇవాళ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి  పరీక్షలు చేయించుకోనున్నారు. 


 Also Read :- చంద్రబాబు మీడియాతో ఎలా మాట్లాడతారు.. కోర్టులో సీఐడీ