సర్కారు తొత్తును కాను…టీచర్ల ప్రతినిధిగానే ఉంటా

సర్కారు తొత్తును కాను…టీచర్ల ప్రతినిధిగానే ఉంటా

రాష్ట్రం లో విద్యారంగం పూర్తిగా ధ్వంసమైందని, దీన్ని బాగుచేసేందుకు తన వంతు కృషి చేస్తానని వరంగల్‌‌‌‌‌‌‌‌-, ఖమ్మం-,నల్గొండ టీచర్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌ నూతన ఎమ్మె ల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. రానున్న ఆరేళ్లపాటు ఉపాధ్యాయ,అధ్యాపక ప్రతినిధిగా మాత్రమే ఉంటానని, సర్కారు తొత్తుగా ఉండబోనని స్పష్టం చేశారు. తన గెలుపును ఉపాధ్యాయ, అధ్యాపకుల గెలుపుగా భావిస్తున్నానని చెప్పారు. వరంగల్‌‌‌‌‌‌‌‌, ఖమ్మం, నల్గొండ టీచర్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌ ‌‌‌‌‌‌‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పూల రవీందర్‌‌‌‌‌‌‌‌ను ఓడించి ,విజేతగా నిలిచి న నర్సిరెడ్డి బుధవారం ‘వెలుగు’ప్రతినిధితో మాట్లాడారు. టీచర్లు, అధ్యాపకుల గౌరవాన్ని నిలబెట్టడం, వారి సమస్యలు పరిష్కరించడం,ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేయడం.. తనలక్ష్యాలని తెలిపారు. సర్కారు విద్యాసంస్థలతోనే విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంటుం దన్నారు. కాంట్రాక్టు, ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సిం గ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ చేస్తామని సీఎం చెప్పారని, కానీ అది అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేయాలని, తెలుగు మీడియంతోపాటు ఇంగ్లి ష్‌ మీడియం కూడా సమాంతరంగా ప్రారంభిం చాలన్నారు. ధనిక రాష్ట్రమని చెప్తున్న రాష్ట్రం లో ఇప్పటికీ ఐఆర్‌‌‌‌‌‌‌‌ కానీ, పీఆర్‌‌‌‌‌‌‌‌సీ గానీ ఇవ్వలేదని, సీఎం హామీ అమలు కాలేదని అన్నారు. ఎమ్మె ల్సీ నిధులన్నీ విద్యారంగం బలోపేతానికే ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు.