
మెడికల్ ఆఫీసర్ పోస్టు భర్తీకి పుణెలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు జూన్ 6 ఆఖరు.
పోస్టు: మెడికల్ ఆఫీసర్– 01
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025, మే 1నాటికి
30 ఏండ్లు నిండి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472.
అప్లికేషన్లు ప్రారంభం: మే 14.
లాస్ట్ డేట్: జూన్ 6.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు రూ.40,000 - రూ.1,40,000.