సెమీస్‌‌‌‌లో బెల్జియం, ఆస్ట్రేలియా

సెమీస్‌‌‌‌లో బెల్జియం, ఆస్ట్రేలియా

భువనేశ్వర్‌‌‌‌: డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ బెల్జియం, మూడుసార్లు విజేత ఆస్ట్రేలియా మెన్స్‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో సెమీఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన తొలి క్వార్టర్‌‌‌‌ ఫైనల్లో ఆస్ట్రేలియా 4–3తో స్పెయిన్‌‌‌‌పై విజయం సాధించింది. దాంతో, వరుసగా 12వ సారి మెగా టోర్నీలో సెమీస్‌‌‌‌ చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో బెల్జియం 2–0తో న్యూజిలాండ్‌‌‌‌ను ఓడించి టైటిల్‌‌‌‌ను నిలబెట్టుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది.