
లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్షన్ లో బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా స్వాతిముత్యం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల 13న విడుదల కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇవాళ కొత్త తేదీని అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ గా రిలిజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ తెలుపు సినిమాలోని ఓ పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో హీరో బెల్లంకొండ గణేష్, హీరోయిన్ వర్ష బొల్లమ్మ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
గతంలో సినిమా ఆపేసిన కారణంపై నిర్మాత నాగవంశీ స్పందిస్తూ…‘ముందుగా అనుకున్న తేదీన సినిమా విడుదల కోసం పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు జరుపుకున్నాం. పరిశ్రమలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. థియేటర్‌లకు అప్పటిలాగ ప్రేక్షకులు రావడం లేదు. మాకిది సరైన సమయమే అయినా.. మిగతా సినిమాలకు ఇబ్బంది కలిగించకూడదని విడుదల వాయిదా వేస్తున్నాం. ఇది మాకు ఇబ్బంది కలిగించినా తప్పడం లేదు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ క్రమంలోనే కొత్త తేదీని అనౌన్స్ చేసిన యూనిట్.. దసరా సెలవులు.. సెలబ్రేషన్స్ కలెక్షన్స్ పరంగా కలిసొస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి.. దసరాకు వచ్చే పెద్ద సినిమాలను తట్టుకుంటుందా.. మళ్లీ పోటీ నుంచి తప్పుకుంటుందా..!
The date is set!!
— Mana Stars (@manastarsdotcom) August 10, 2022
A Beautiful tale of our Bhagyalakshmi & Balamurali is ready to take you on a fun & exquisite ride on OCT 5th in theatres near you! ?❤️#SwathimuthyamOnOct5th ✨#Ganesh @VarshaBollamma @Lakshmankkrish2 @mahathi_sagar @dopSURYAA @vamsi84 @adityamusic pic.twitter.com/KCefhv4euT