కాసిపేట మండలంలో గుడుంబా కేంద్రాలపై దాడులు

కాసిపేట మండలంలో గుడుంబా కేంద్రాలపై దాడులు

బెల్లంపల్లి, వెలుగు: కాసిపేట మండలం దేవాపూర్​పోలీస్​స్టేషన్​పరిధిలోని లంబాడితాండ(డి)లో నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై ఎస్సై గంగారాం ఆధ్వర్యంలో శనివారం దాడులు చేవారు. గ్రామ శివారులో పలు చోట్ల గుడుంబా తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేశారు. 

గుడుంబా తయారు చేసేందుకు వినియోగించే 1500 లీటర్ల బెల్లం పానకంతో పాటు కుండలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో గుడుంబా తయారు చేసినా, అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.