బెన్ స్టోక్స్ @ 1: ఆల్రౌండర్ ర్యాంక్ సొంతం

బెన్ స్టోక్స్ @ 1: ఆల్రౌండర్ ర్యాంక్ సొంతం

దుబాయ్: వెస్టిండీస్ తో జరిగిన సెకండ్ టెస్ట్ లో ఇంగ్లండ్ విజయంలో కీ రోల్ షోషించిన బెన్ స్టోక్స్ ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్ లో టాప్ ప్లేస్ కు చేరాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో ఆల్రౌండర్ కేటగిరీలో స్టోక్స్ వరల్డ్ నంబ‌ర్ వ‌న్ గా నిలిచాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ను వెనక్కి నెట్టాడు. అంతేకాక ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత నంబర్ వన్ ఆల్రౌండర్ గా నిలిచిన ఇంగ్లండ్ ప్లేయర్ గానూ రికార్డులకెక్కాడు. మరోపక్క బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లోనూ స్టోక్స్ దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్
మన్ మార్నస్ లబుషేన్ తో కలిసి మూడో ర్యాంకును పంచుకున్నాడు. మాంచెస్టర్ టెస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ డామ్ సిబ్లే 29 స్థానాలు ఎగబాకి 35ద ర్యాంకుకు చేరాడు. ఇక, బౌలింగ్ర్ ర్యాంకుల్లో స్టువర్ట్ బ్రాడ్ తిరిగి టాప్–10లో చోటు దక్కించుకున్నాడు. క్రిస్ వోక్స్ కెరీర్ బెస్ట్ 21వ ర్యాంక్ సాధించాడు.

టీమ్ తో కలిసిన ఆర్చర్

ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మంగళవారం తిరిగి జట్టుతో కలిశాడు. విండీస్ తో ఫస్ట్ టెస్ట్ అనంతరం కరోనా ప్రొటో కాల్స్ బ్రేక్ చేసిన ఆర్చర్ సెకండ్ మ్యాచ్ కు దూరమయ్యాడు. అప్పటి నుంచి ఐదు రోజులు ఐసోలేషన్ లో ఉన్న ఆర్చర్ కు రెండు సార్లు  కరోనా టెస్టులు చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో అతను తిరిగి జట్టుతో కలిశాడు. థర్డ్ టెస్ట్ సెలెక్షన్ కు అందుబాటులో ఉంటాడు. ప్రొటోకాల్స్ ను బ్రేక్ చేసిన ఆర్చర్ ను రాత పూర్వకంగా హెచ్చరించిన క్రమశిక్షణ కమిటీ 15 వేల పౌండ్లు జరిమానా విధించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం..