కెప్టెన్సీకి బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్ గుడ్ బై!

కెప్టెన్సీకి బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్ గుడ్ బై!

లండన్‌‌‌‌‌‌‌‌: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌పై లార్డ్స్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో సాధించిన అద్భుత విజయానందం ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ జట్టులో ఎక్కువ కాలం నిలవలేదు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ గెలుపు సంబురాల్లో భాగంగా కెప్టెన్‌‌‌‌‌‌‌‌  బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌, గస్‌‌‌‌‌‌‌‌ అట్కిన్సన్‌‌‌‌‌‌‌‌ సోమవారం తెల్లవారుజామున ఓ నైట్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన గొడవలో ఇరుక్కున్నారు. దీంతో ఈ వివాదంపై ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ బోర్డు (ఈసీబీ) క్రమశిక్షణా విచారణకు ఆదేశించింది. 

ఒకవేళ ఇందులో స్టోక్స్‌‌‌‌‌‌‌‌, అట్కిన్సన్‌‌‌‌‌‌‌‌ది తప్పు అని తేలితే బోర్డు కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. అయితే దీనికంటే ముందే స్టోక్స్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీతో పాటు టెస్ట్​ క్రికెట్‌‌‌‌‌‌‌‌కు పూర్తిగా గుడ్‌‌‌‌‌‌‌‌బై చెప్పాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. యాషెస్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ తర్వాత హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ బ్రెండన్‌‌‌‌‌‌‌‌ మెకల్లమ్‌‌‌‌‌‌‌‌తో స్టోక్స్‌‌‌‌‌‌‌‌కు విభేదాలు వచ్చాయని, ఈ వివాదంతో అతని కెరీర్‌‌‌‌‌‌‌‌కే ఫుల్‌‌‌‌‌‌‌‌స్టాఫ్‌‌‌‌‌‌‌‌ పడొచ్చని వెల్లడిస్తున్నారు. మరోవైపు కొన్ని రోజులు క్రికెట్‌‌‌‌‌‌‌‌కు తాత్కాలిక విరామం కూడా ప్రకటించే చాన్స్‌‌‌‌‌‌‌‌ లేకపోలేదని చెబుతున్నారు. 

ఈ మొత్తం ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌పై స్పందించిన ఈసీబీ నైట్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఘటన సమయంలో స్టోక్స్‌‌‌‌‌‌‌‌, అట్కిన్సన్‌‌‌‌‌‌‌‌ అక్కడే ఉన్నారని స్పష్టత ఇచ్చింది. దీనిపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో జరిగే రెండో టెస్టు జట్టు ప్రకటనను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. స్టోక్స్ నుంచి వివరణ వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు.