గెలిచిన ఆనందంలో నైట్‌క్లబ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ గొడవ.. చిక్కుల్లో బెన్ స్టోక్స్!

గెలిచిన ఆనందంలో నైట్‌క్లబ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ గొడవ.. చిక్కుల్లో బెన్ స్టోక్స్!

Ben Stokes Nightclub Incident: ఇంగ్లాండ్ క్రికెట్‌లో ఒక పెద్ద నైట్‌క్లబ్ గొడవ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో 115 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, ఈ మ్యాచ్ గెలిచిన ఆనందంలో లండన్‌లోని ఒక నైట్‌క్లబ్‌కు వెళ్లిన ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, బౌలర్ గస్ అట్కిన్సన్ ఒక పెద్ద గొడవలో ఇరుక్కున్నారు.

రూల్స్ బ్రేక్ చేసిన బెన్ స్టోక్స్: 
జట్టు రూల్స్ ప్రకారం.. అర్ధరాత్రి దాటాక బయట ఉండకూడదనే నిబంధనను వీరు బ్రేక్ చేయడమే కాకుండా.. అక్కడ జరిగిన ఒక గొడవలో భాగమవ్వడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వీరిపై సీరియస్ అయింది. ఈ ఇన్సిడెంట్ వల్ల బెన్ స్టోక్స్ తన టెస్ట్ కెప్టెన్సీని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని బ్రిటీష్ మీడియా కథనాలు ప్రచారం చేసింది. 

అసలు గొడవ ఏంది?: 
లండన్‌లోని ఒక నైట్‌క్లబ్‌లో లండన్ ప్రొఫెషనల్ రగ్బీ క్లబ్ సారసన్స్ అకాడమీకి చెందిన ఒక యంగ్ రగ్బీ ప్లేయర్ కూడా ఉన్నాడు. అక్కడ ఆ ప్లేయర్‌కు, ఇంగ్లీష్ క్రికెటర్లకు మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. ఆ రగ్బీ ప్లేయర్ ఇంగ్లాండ్ బౌలర్ గస్ అట్కిన్సన్‌ను కొట్టడానికి బలంగా పంచ్ విసిరాడు. కానీ ఆ దెబ్బ అట్కిన్సన్‌కు తగలకుండా వాళ్లతో ఉన్న ఈసీబీ సెక్యూరిటీ గార్డుకు బలంగా తాకింది. దీంతో ఆ గార్డుకు తీవ్ర గాయమై కుట్లు పడ్డాయి. ఈ గొడవలో బెన్ స్టోక్స్, అట్కిన్సన్ కి గాయపడలేదు.. పైగా గొడవను వీళ్లు స్టార్ట్ చేయలేదని, ఆ రగ్బీ ప్లేయరే రెచ్చగొట్టాడని ఈసీబీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, రూల్స్ బ్రేక్ చేసి అర్ధరాత్రి సమయంలో క్లబ్‌లోనే ఉండటమే వీళ్లు చేసిన పెద్ద తప్పు అని క్రికెట్ బోర్డు భావిస్తోంది.

ఈసీబీ అఫీషియల్ స్టేట్‌మెంట్: 
ఈ గొడవపై ఈసీబీ స్పందిస్తూ ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. న్యూజిలాండ్ ఫస్ట్ టెస్ట్ ముగిశాక టీమ్ ప్రోటోకాల్స్‌ను బ్రేక్ చేసిన విషయంపై మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశామని వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున ఒక నైట్‌క్లబ్‌లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ అక్కడే ఉన్నారని తెలిసింది.. దీనిపై పూర్తి సమాచారం సేకరిస్తున్నాం, ఒక ఇండిపెండెంట్ బోర్డుతో దర్యాప్తు చేయిస్తున్నట్లు తెలిపింది. ఈ గొడవ కారణంగా సెకండ్ టెస్ట్ మ్యాచ్‌కు స్టోక్స్, అట్కిన్సన్‌లను పక్కనబెట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ విచారణలో తప్పు తేలి స్టోక్స్ కెప్టెన్సీ పోతే వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జట్టును నడిపించవచ్చనే టాక్ నడుస్తోంది.

పాత డ్రింకింగ్ కల్చర్ గుర్తొచ్చింది: 
ఈ ఇన్సిడెంట్‌తో ఇంగ్లాండ్ క్రికెటర్ల పాత అలవాట్లు మళ్లీ బయటపడ్డాయి. గత ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్లలో ఇంగ్లాండ్ ప్లేయర్ల ఆఫ్ ఫీల్డ్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా యాషెస్ సిరీస్ టైమ్‌లో మ్యాచ్‌లు ఘోరంగా ఓడిపోతున్నా సరే డ్రెస్సింగ్ రూమ్‌లో డ్రింకింగ్ కల్చర్ అలవాటు ఎక్కువైందని జనాలు తిట్టిపోశారు. అంతేకాదు, ప్రస్తుతం ఇంగ్లాండ్ టీ20, వన్డే కెప్టెన్‌గా ఉన్న హ్యారీ బ్రూక్ కూడా గతంలో న్యూజిలాండ్ టూర్ లో ఇలాగే ఒక నైట్‌క్లబ్ బౌన్సర్‌తో గొడవపడి ఫైన్ కట్టాడు. సిరీస్ ఓడిపోతున్న టైమ్‌లో మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి బ్రూక్ అలా క్లబ్‌లో లొల్లి చేయడంతో అప్పట్లో పెద్ద రచ్చైంది.