కొనసాగుతున్న మార్కెట్ లాభాలు

కొనసాగుతున్న మార్కెట్ లాభాలు
  •    22,530 దగ్గర నిఫ్టీ ఆల్‌‌ టైమ్ హై

ముంబై :  బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు సోమవారం కొత్త గరిష్టాలను టచ్ చేశాయి.  విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా మారడంతో పాటు ఆసియా మార్కెట్‌‌లు లాభాల్లో ట్రేడవ్వడంతో  నిఫ్టీ   ఇంట్రాడేలో 22,530‌‌‌‌ దగ్గర ఆల్‌‌ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 135 పాయింట్ల (0.61 శాతం) లాభంతో 22,462 దగ్గర ముగిసింది. సెన్సెక్స్‌‌ 363 పాయింట్లు పెరిగి 74,015 దగ్గర సెటిలయ్యింది.  

రియల్టీ, మెటల్ షేర్లు ఎక్కువగా లాభపడగా, ఎఫ్‌‌ఎంసీజీ, ఆటో షేర్లు ఇండెక్స్‌‌లను కిందకి లాగాయి. సెన్సెక్స్‌‌లో జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్‌‌, టాటా స్టీల్‌‌, అల్ట్రాటెక్‌‌ సిమెంట్‌‌, ఎన్‌‌టీపీసీ, ఎల్ అండ్ టీ, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ షేర్లు గ్రీన్‌‌లో ముగియగా, టైటాన్‌‌, నెస్లే, భారతీ  ఎయిర్‌‌‌‌టెల్‌‌, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.

కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌ను  లాభంతో మార్కెట్‌‌లు ప్రారంభించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. షార్ట్‌‌ టెర్మ్‌‌లో ఈ ట్రెండ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. క్యూ4 రిజల్ట్స్‌‌, ఫెడ్ జూన్‌‌లో వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు మార్కెట్‌‌ను నడిపిస్తాయని అభిప్రాయపడ్డారు.