మార్కెట్ ర్యాలీకి బ్రేక్..22,350 దిగువకు నిఫ్టీ

మార్కెట్ ర్యాలీకి బ్రేక్..22,350 దిగువకు నిఫ్టీ
  •     ఇంట్రాడేలో 22,527 దగ్గర ఆల్‌‌‌‌‌‌‌‌ టైమ్ హై నమోదు
  •     నెగెటివ్‌‌‌‌‌‌‌‌లో అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు

ముంబై : వరుసగా రెండు  సెషన్లలో లాభపడిన బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు సోమవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రూల్స్‌‌‌‌‌‌‌‌ను పాటించడానికి ఐపీఓకి రావడం కంటే ఇతర మార్గాలను  టాటా సన్స్ పరిశీలిస్తోందని రిపోర్ట్స్ వెలువడ్డాయి. దీంతో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం 5 శాతం నుంచి 10 శాతం వరకు పడ్డాయి. మరోవైపు బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు కూడా నెగెటివ్‌‌‌‌‌‌‌‌లో కదలడంతో నిఫ్టీ 161 పాయింట్లు (0.71 శాతం)  పతనమైంది. సెషన్‌‌‌‌‌‌‌‌ను  22,333 దగ్గర ముగించింది. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ 617 పాయింట్లు నష్టపోయి 73,503 దగ్గర  సెటిలయ్యింది. లాభాల్లో ఓపెన్ అయిన నిఫ్టీ

ఇంట్రాడేలో 22,527 దగ్గర ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. కానీ,  ప్రారంభ లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకుంది. ఇన్వెస్టర్లు సంపద రూ.3.15 లక్షల కోట్లు తగ్గింది. నిఫ్టీలో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌, పవర్ గ్రిడ్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, టాటా స్టీల్‌‌‌‌‌‌‌‌, బజాజ్‌‌‌‌‌‌‌‌ ఆటో, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అపోలో హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌, నెస్లే ఇండియా, సిప్లా, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ లైఫ్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌, బజాజ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు నష్టాల్లో ముగిశాయి.  

ఆటో, క్యాపిటల్ గూడ్స్‌‌‌‌‌‌‌‌, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌, బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఐటీ, రియల్టీ, మెటల్, పవర్ సెక్టార్ల ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు ఒక శాతం వరకు నష్టపోయాయి.  బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ 0.2 శాతం పడగా, స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌2 శాతం వరకు క్రాష్​ అయ్యింది. సుమారు 200  షేర్లు ఏడాది గరిష్టాన్ని టచ్‌‌‌‌‌‌‌‌ చేశాయి. ఏబీబీ ఇండియా, బ్లూ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిప్లా, కోల్గేట్‌‌‌‌‌‌‌‌ పామోలివ్‌‌‌‌‌‌‌‌, కమ్మిన్స్ ఇండియా, గ్లెన్‌‌‌‌‌‌‌‌మార్క్ ఫార్మా వంటి షేర్లు ఈ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.  

ఎనలిస్టులు ఏమంటున్నారంటే?

1)   హయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్స్‌‌‌‌‌‌‌‌ దగ్గర  అమ్మకాల ఒత్తిడి నెలకొందని, నిఫ్టీ 22,100 – 22,600 రేంజ్‌‌‌‌‌‌‌‌లో ఇక కన్సాలిడేట్ అవ్వొచ్చని బీఎన్‌‌‌‌‌‌‌‌పీ పారిబా టెక్నికల్ ఎనలిస్ట్ జతిన్ గేడియా పేర్కొన్నారు. 22,224 – 22,167  లెవెల్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా, 22,530 – 22,600  రెసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తాయని అంచనా వేశారు. బ్యాంక్ నిఫ్టీ 46,900 – 46,800 వరకు పడిపోవచ్చని అన్నారు. 

2) నిఫ్టీ ఓవరాల్ ట్రెండ్ బుల్లిష్‌‌‌‌‌‌‌‌గా ఉందని ఎల్‌‌‌‌‌‌‌‌కేపీ సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్‌‌‌‌‌‌‌‌ దే అన్నారు. మధ్యలో కరెక్షన్స్ ఉండొచ్చని పేర్కొన్నారు. 22,200–2,250 లెవెల్ సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా,  22,400 లెవెల్‌‌‌‌‌‌‌‌ రెసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తాయని అంచనా వేశారు.  3)  యూఎస్‌‌, ఇండియా ఇన్‌‌ఫ్లేషన్ నెంబర్లు  మంగళవారం వెలువడనున్నాయని, దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని ఎనలిస్టులు పేర్కొన్నారు.