
హైదరాబాద్: ఓయో లాడ్జిలో అనుమానాస్పద రీతిలో ఓ మహిళ మృతి చెందింది. వనస్థలిపురంలోని అభ్యుదయ నగర్ లో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. లాడ్జి సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన మహిళను బెంగాల్ కు చెందిన సంగీత(48) గా గుర్తించారు. మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన లోకేష్(28) అనే యువకుడి కోసం సంగీత హైదరాబాద్ వచ్చినట్లుగా తెలిపారు .
మూడు రోజుల నుంచి వారిద్దరూ లాడ్జి రూమ్ లోనే గడిపారని, గత రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని లాడ్జి సిబ్బంది తెలిపారు. ఈ గొడవలోనే సంగీత ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని చెప్పారు. లోకేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతనే సంగీతను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించాడా.? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.