పేరుకే ఫైనాన్షియల్ సిటీ.. మెట్రో నగరాల్లో మేటీ.. కానీ వసతుల్లో అధ్వాన్నం.. ఎప్పుడు ఏదో ప్రజాసమస్యలతో వార్తల్లో ఉంటే బెంగళూరు సిటీ.. అధికారుల నిర్లక్ష్యం, వర్షాల కారణంగా రోడ్లు అస్తవ్యస్థంగా తయారయ్యి మరోసారి వార్తల్లోకెక్కింది. గుంతలమయమైన రోడ్లతో ప్రయాణికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోతో బెంగళూరు సిటీలో రోడ్ల పరిస్థితిని అద్దం పడుతోంది. గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో బైకిస్టును వాటర్ ట్యాంకర్ ఢీకొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.
వైరల్ అవుతున్న వీడియోలో దృశ్యాలు.. బెంగళూరు సిటీలోని రోడ్ల అధ్వాన్న పరిస్థితులకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వర్షం కారణంగా రోడ్డు మొత్తం గుంతలు పడి నీళ్లు నిలిచి వాహనదారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో ఓ బైకర్ ను వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. అప్రమత్తమైన బైకిస్టు వెంటనే పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. క్షణం ఆలస్యం అయినా అతని ప్రాణం గాల్లో కలిసుండేది.
ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు బెంగళూరు సిటీలో రోడ్ల పరిస్థితి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పేరుకు పెద్దనగరం.. దేశానికి ఆర్థిక రాజధాని అని పేరేగానీ వసతులు మాత్రం నిల్ అని మండిపడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు, రెంట్ ఇష్యూస్, సిటీలో భద్రత వంటి ప్రజాసమస్యలతో అనేక సార్లు వార్తల్లో నిలిచింది. తాజాగా గుంతలమయమైన రోడ్లతో మరోసారి నెటిజన్ల అటెన్షన్ కు దారితీసింది.
Bengaluru: A tanker ran over a bike while trying to avoid potholes.
— Facts (@BefittingFacts) August 20, 2026
Look at the condition of the road. pic.twitter.com/g4nkvTqUHd
