
బెంగళూరులో క్రికెట్ కు చాలా క్రేజ్ ఉంది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ విజయోత్సవ వేడుకల తర్వాత జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. 32000 సీటింగ్ కెపాసిటీ ఉన్న చిన్నస్వామి స్టేడియంలో ఇకపై క్రికెట్ ఆడే సూచనలు కనిపించడం లేదు. చిన్నస్వామి ఈ స్టేడియాన్ని మరపిస్తూ బెంగళూరులో అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించబోతున్నారు. భవిష్యత్తులో బెంగళూరు నగరంలో కొత్త క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది. ఈ స్టేడియం సూర్య సిటీ, బొమ్మసంద్రలో ఉంటుంది.
స్టేడియం సీటింగ్ కెపాసిటీ 80,000 కావడం విశేషం. ఇండియాలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మారనుంది. ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట తర్వాత బెంగళూరు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బొమ్మసంద్రలోని సూర్య సిటీలో రూ.1,650 కోట్లతో మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఆమోదించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం తర్వాత ఇండియాలో ఇదే అతి పెద్ద స్టేడియంగా మారనుంది. చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 32,000 కాగా.. 17 ఎకరాల్లో విస్తరించి ఉంది. అయితే ఇప్పుడు నిర్మించబోయే కొత్త స్టేడియంలో మూడు రెట్లు పెద్దది కానుంది.
కొత్త స్టేడియం బెంగళూరు దక్షిణ శివార్లలో 100 ఎకరాల స్పోర్ట్స్ హబ్ కోసం కర్ణాటక హౌసింగ్ బోర్డు (KHB) ప్రతిష్టాత్మక ప్రణాళికను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది. స్టేడియానికి కావాల్సిన నిధులు కర్ణాటక హౌసింగ్ బోర్డు సమకూరుస్తుంది. ఇందులో ఎనిమిది ఇండోర్, ఎనిమిది అవుట్‌డోర్ స్పోర్ట్స్ మైదానాలు, జిమ్‌లు, శిక్షణా సౌకర్యాలు, పెద్ద స్విమ్మింగ్ పూల్, హోటళ్ళు, అంతర్జాతీయ కార్యక్రమాల కోసం ఒక హాల్ కూడా ఉంటాయి.
🚨 NEW STADIUM IN BENGALURU. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 9, 2025
- A cricket new stadium with a budget of 1,650cr and a capacity of 80,000 will be built in Bommasandra, Bengaluru. pic.twitter.com/RaGKHS1IaP