ఐపీఎల్-19 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ (80), అనికేత్ వర్మ (43) విధ్వంసకర బ్యాటింగ్‌తో భారీ స్కోరు అందించినా.. బౌలర్లు దాన్ని కాపాడలేకపోయారు. భారీ ఛేదనలో విరాట్ కోహ్లీ (69 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (61) చెలరేగడంతో.. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 201/9 స్కోరు చేసింది. తర్వాత బెంగళూరు 15.4 ఓవర్లలోనే 203/4 స్కోరు చేసి నెగ్గింది.
బెంగళూరు: ఐపీఎల్–19 తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ (38 బాల్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80), అనికేత్ వర్మ (18 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43) విధ్వంసకర బ్యాటింగ్‌తో భారీ స్కోరు అందించినా.. బౌలర్లు దాన్ని కాపాడలేకపోయారు. భారీ ఛేదనలో విరాట్ కోహ్లీ (38 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (26 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) చెలరేగడంతో.. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 201/9 స్కోరు చేసింది. తర్వాత బెంగళూరు 15.4 ఓవర్లలో 203/4 స్కోరు చేసి నెగ్గింది. డఫీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇషాన్ అదరహో..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఇషాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోగా, మధ్యలో అనికేత్ వర్మ ధనాధన్ షాట్లతో అలరించాడు. స్టార్టింగ్‌లో పేసర్ జాకబ్ డఫీ (3/23) అద్భుతమైన బౌన్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లను కట్టడి చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఆరు బాల్స్ తేడాలో అభిషేక్ శర్మ (7), ట్రావిస్ హెడ్ (11)ను ఔట్ చేశాడు. ఆ వెంటనే ఐదో ఓవర్‌లో నితీశ్ కుమార్ (1)ను పెవిలియన్‌కు పంపడంతో హైదరాబాద్ 29/3 స్కోరుతో కష్టాల్లో పడింది.
ఈ దశలో ఇషాన్, హెన్రిచ్ క్లాసెన్ (22 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) ఆకాశమే హద్దుగా చెలరేగారు. పవర్‌ప్లేలో 49/3 ఉన్న స్కోరును ఫస్ట్ టెన్‌లో 87/3కి పెంచారు. ఈ క్రమంలో ఇషాన్ 27 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. క్రీజులో కుదురుకుపోయిన ఈ జోడీని 14వ ఓవర్‌లో షెఫర్డ్ (3/54).. క్లాసెన్ ఔట్ చేసి విడదీశాడు. దాంతో నాలుగో వికెట్‌కు 97 రన్స్ జతయ్యాయి. మరో ఎనిమిది బాల్స్ తర్వాత సలీల్ అరోరా (9) ఔట్‌కావడంతో స్కోరు 137/5గా మారింది.
అభినందన్ (1/38) బౌలింగ్‌లో 6, 4, 6, క్రునాల్ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన ఇషాన్ 16వ ఓవర్‌లో వెనుదిరిగాడు. ఈ దశలో వచ్చిన అనికేత్ వర్మ భారీ హిట్టింగ్‌కు తెరలేపాడు. రెండో ఎండ్‌లో హర్ష్ దూబే (3), హర్షల్ పటేల్ (0)ను షెఫర్డ్ దెబ్బకొట్టినా.. వర్మ మాత్రం లాంగాన్, లాంగాఫ్‌లో భారీ సిక్సర్లు కొట్టాడు. మధ్యలో అనికేత్ ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ వదిలేయడం కూడా ఎస్‌ఆర్‌హెచ్‌కు కలిసొచ్చింది. చివరి ఐదు ఓవర్లలో సన్‌రైజర్స్ 59 రన్స్ చేయడంతో స్కోరు 200లకు చేరింది.
కోహ్లీ నిలకడ..
ఛేజింగ్‌లో ఆర్సీబీకి రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. జైదేవ్ ఉనాద్కట్ (1/29) దెబ్బకు ఫిల్ సాల్ట్ (8) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. 1/9 స్కోరు వద్ద కోహ్లీకి తోడైన పడిక్కల్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో రైజర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో 76/1 స్కోరుతో పవర్‌ప్లేను ముగించాడు. రెండో ఎండ్‌లో నిలకడగా ఆడిన కోహ్లీ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. దాన్ని ఆసరాగా చేసుకున్న పడిక్కల్ 21 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ 9వ ఓవర్‌లో హర్ష్ దూబే (1/35)కు వికెట్ ఇవ్వడంతో రెండో వికెట్‌కు 45 బాల్స్‌లోనే 101 రన్స్ జోడించాడు.
ఇక 110/2 వద్ద వచ్చిన కెప్టెన్ రజత్ పటీదార్ (31) ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. చకచకా బౌండ్రీలు బాదుతూ మూడో వికెట్‌కు 22 బాల్స్‌లోనే 53 రన్స్ రాబట్టాడు. అయితే 13వ ఓవర్‌లో పైన్ (2/35) వరుస బాల్స్‌లో పటీదార్, జితేష్ శర్మ (0)ను ఔట్ చేయడంతో ఆర్సీబీ 163/4తో కొద్దిగా ఇబ్బందుల్లో పడింది. అయినా ఓ ఎండ్‌లో స్థిరంగా ఆడిన విరాట్.. టిమ్ డేవిడ్ (16 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 19 బాల్స్‌లోనే 40 రన్స్ జత చేసి మరో 26 బాల్స్ మిగిలి ఉండగానే ఈజీగా విజయాన్ని అందించారు.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లలో 201/9 (ఇషాన్ 80, అనికేత్ 43, డఫీ 3/22, షెఫర్డ్ 3/54).
బెంగళూరు: 15.4 ఓవర్లలో 203/4 (కోహ్లీ 69*, పడిక్కల్ 61, పైన్ 2/35).
