స్కూల్ కి రావట్లేదని పైప్ తో చితగ్గొట్టిన ప్రిన్సిపాల్.. ఆసుపత్రిపాలైన స్టూడెంట్..

స్కూల్ కి రావట్లేదని పైప్ తో చితగ్గొట్టిన ప్రిన్సిపాల్.. ఆసుపత్రిపాలైన స్టూడెంట్..

బెంగుళూరులో దారుణం జరిగింది.. స్కూల్ కి సక్రమంగా రావట్లేదని ఓ స్టూడెంట్ ను పైప్ తో చితగ్గొట్టాడు ప్రిన్సిపాల్. తీవ్ర గాయాలైన స్టూడెంట్ ఆసుపత్రిపాలయ్యాడు. అక్టోబర్ 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న స్టూడెంట్ స్కూల్ కి సక్రమంగా రావట్లేదని గదిలో బందించి పీవీసీ పైప్ తో చితగ్గొట్టాడు ప్రిన్సిపాల్. దీంతో తీవ్ర గాయాలైన స్టూడెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ సంఘటన మాగడి రోడ్డులోని సుంకడకట్టెలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగింది.అక్టోబర్ 14న ప్రిన్సిపాల్ రాకేష్ కుమార్, టీచర్ చంద్రిక తన కొడుకును పివిసి పైపుతో కొట్టి.. సాయంత్రం వరకు గదిలో బంధించారని బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపాల్‌ను విచారించి, తరువాత బెయిల్‌పై విడుదల చేశారు. సక్రమంగా హాజరు కాకపోవడంతో అతను పిల్లవాడిపై దాడి చేసినట్లు అంగీకరించాడని తెలిపారు పోలీసులు.

మరో ఘటనలో ఓ స్టూడెంట్ తన అమ్మమ్మకు ఫోన్ చేసినందుకు అతన్ని చితగ్గొట్టాడు ఓ టీచర్.చిత్రదుర్గలోని నాయకనహట్టి గ్రామంలోని ఓ ఆలయానికి చెందిన స్కూల్లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.