
బెంగళూరు: పోక్సో కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో కర్నాటక మాజీ సీఎం యెడియూరప్పపై బెంగళూరు కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో యెడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై శుక్రవారం విచారణ జరగనుంది. మరోవైపు ఈ కేసులో సీఐడీ బుధవారం యెడియూరప్పకు నోటీసులు ఇచ్చింది. 17 ఏండ్ల బాలికను లైంగికంగా వేధించినట్లు ఆయనపై ఈ ఏడాది మార్చిలో కేసు నమోదైంది.
ఓ మీటింగ్ టైమ్లో తన బిడ్డను యెడియూరప్ప బలవంతంగా ఓ గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైంది. బాధితురాలి తల్లి అనారోగ్యంతో ఇటీవలే చనిపోయింది. అయితే, ఈ కేసులో యెడియూరప్పను సీఐడీ అరెస్టు చేసే అవకాశముందని కర్నాటక మంత్రి పరమేశ్వర కూడా వెల్లడించారు.