V6 News

రామచిలుకను కాపాడబోతే.. యువకుడి ప్రాణాలు పోయాయ్

రామచిలుకను కాపాడబోతే.. యువకుడి ప్రాణాలు పోయాయ్

లక్షలు పెట్టి కొనుక్కున్నాడు. ప్రేమతో సాకుతున్నాడు.అదంటే అతని ప్రాణం.. ఆ ఇష్టమే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. లక్షల విలువైన పెంపుడు రామచిలుకను కాపాడేందుకు వెళ్లి  32ఏళ్ల యువకుడు  విద్యుత్ షాక్ తో చనిపోయిన ఘటన  బెంగళూరులో చోటు చేసుకుంది. 

బెంగళూరులోని గిరినగర్ ప్రాంతానికి చెందిన  అరుణ్ కుమార్ ఇటీవల రూ. 2.50 లక్షలు పోసి రామచిలుకను కొనుగోలు చేశాడు. దానికి మకాన్ అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నాడు. దానికి ఇష్టమైన ఆహారం పెట్టి ప్రేమగా సాగుతున్నాడు. ఇలా రామచిలుకతో ఎంజాయ్ చేస్తున్న వసంత్  కుమార్.. అనుకోని సంఘటతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 

శుక్రవారం (డిసెంబఱ్ 12) ఇంట్లో ఎగిరిపోయిన రామచిలుక అరుణ్ కుమార్ ఇంటి పక్కన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లపై  వాలింది. దీంతో రామచిలుకను తిరిగి రప్పించే క్రమంలో ఇంటి గోడపైకి ఎక్కి ఇనుప పైపుతో అదిలించే ప్రయత్నం చేశాడు. అయితే ఇనుప పైపు హైటెన్షన్ వైర్లకు తాగడంతో అరుణ్ కుమార్ కు షాక్ తగిలి గోడపైనుంచి కిందపడ్డాడు. 

తీవ్రగాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఇళ్ల మధ్యలో హైటెన్షన్ వైర్ల స్థంభాలు ఉండటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన హైలైట్ చేస్తుంది.