ట్రంప్ మధ్యవర్తిత్వంపై నెటిజన్ల సెటైర్లు..మీమ్స్, ఇమోజీలు, కామెంట్లతో సోషల్ మీడియా బాక్సులు ఫుల్

ట్రంప్ మధ్యవర్తిత్వంపై నెటిజన్ల సెటైర్లు..మీమ్స్, ఇమోజీలు, కామెంట్లతో సోషల్ మీడియా బాక్సులు ఫుల్

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ మధ్యవర్తిత్వంపై నెట్టింట సెటైర్లే సెటర్లు.. మీడియేటర్ ట్రంప్ మామాపై మీమ్స్, ఇమోజీ, కామెంట్లతో సోషల్ మీడియా బాక్సులు నిండిపోయాయి.

Hello @realDonaldTrump

Could you please mediate with BBMP to ESCALATE Ejipura flyover works in Bengaluru. We'll name it as MAGA Trump flyover

& with BMRCL for Yellow line Metro Trains too in Bangalore

— Karnataka Weather (@BengaluruRains_) May 10, 2025

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విమరణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెటిజన్లకు మంచి స్టఫ్గా మారారు.ముఖ్యంగా బెంగళూరు నెటిజన్లు ట్రంప్ ను ‘‘సర్దార్ డోనాల్డ్ సింగ్ ట్రంప్’’,‘‘సర్పంచ్’’ అంటూ, మీమ్స్, కామెంట్లు, ఇమోజీలతో సెటైరికల్గా  తెగ పొగిడేస్తున్నారు. సెటైరికల్ పోస్టులతో సోషల్ మీడియాలో నవ్వులే నవ్వులు. 

ALSO READ | ఎవరి మధ్యవర్తిత్వమూ అక్కర్లేదు..తేల్చి చెప్పిన భారత్

ట్రంప్ జీ.. మీరు భారత్, పాకిస్తాన్ మీడియేటర్గా పనిచేసి యుద్దం రాకుండా కాపాడారు. అదే విధంగా మా బెంగళూరులో కూడా చాలా పెండింగ్ సమస్యలున్నాయి.. వాటికి కూడా ఓమార్గం చూపండి అంటూ రిక్వెస్ట్ లు పెట్టారు. బెంగళూరులో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఏజీపురా ఫ్లైఓవర్ పూర్తిచేసేందుకు బీబీఎంపీతో తన మధ్యవర్తిత అధికారాలు ఉపయోగించాలని సెటైరికల్ గా స్పందించారు. 

ట్రంప్ను రిక్వెస్ట్ చేస్తూ కర్ణాటక వెదర్ సోషల్ మీడియాలో ప్లాట్ ఫాం Xలో ఓ పోస్ట్ చేసింది. వాతావరణ విషయాలను అప్డేట్స్ అందించే ఈ ఖాతాలో ఏజీపురా ప్లైఓవర్ ను పూర్తి  చేసేలా మధ్యవర్తిత్వం వహించాలని కోరింది. 

"హలో డోనాల్డ్ ట్రంప్, బెంగళూరులోని ఎజిపురా ఫ్లైఓవర్ పనులను ESCALATE చేయడానికి మీరు BBMP తో మధ్యవర్తిత్వం వహించగలరా? మేం దానికి MAGA ట్రంప్ ఫ్లైఓవర్ అని పేరు పెడతాం " అని కర్ణాటక వెదర్ తన పోస్ట్‌లో షేర్ చేశారు. నగరంలో ఎల్లో లైన్ మెట్రో రైలు పనుల వేగాన్ని వేగవంతం చేయడానికి BMRCL తో మాట్లాడాలని కూడా ఆయనను రిక్వెస్ట్ చేశారు. 

దీంతో పాటు భారత్,-పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడం అంత పెద్ద విషయం కాదు..ట్రంప్ బలమైన సంధానకర్త ,ప్రపంచ నాయకుడని నిరూపించుకోవాలనుకుంటే దీన్ని చేసి ప్రపంచానికి తన విలువను నిరూపించుకోనివ్వండి" అని కర్ణాటక వెదర్ జోడించింది.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. Xలో నవ్వులే నవ్వులు. 

ఓ నెటిజన్ స్పందిస్తూ..BBMP వారి గాఢ నిద్ర నుంచి మేల్కోవడం లేదు.. BBMP నుంచి Ejipura ఫ్లైఓవర్‌ను స్వాధీనం చేసుకుని దానిని పూర్తి చేయమని పాకిస్తాన్ సైన్యాన్ని కోరుకుందాం. BBMPతో మా తరపున చర్చలు జరపమని ట్రంప్‌ను అడుగుదాం ’’ అంటూ పోస్ట్ చేశారు. 

pic.twitter.com/VxolfJ2abJ

— ಶಿವ शिव Shivu R H (@shivurh) May 11, 2025

ఇంకో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఏజీపురా ఫ్లైఓవర్ చారిత్రాత్మకమైనది.. ట్రంప్, జేడీ వాన్స్ ఏదైనా చేయాలని చూసినా మా ASI దానిని ధ్వంసం చేయనీయరు’’ అంటూ హాస్యంగా పోస్ట్ చేశారు.  

మరొక "మీరు BBMP తో చర్చలు జరపగలిగితే మీరు నిజంగా ప్రపంచ నాయకుడు" అని ఓ నెటిజన్ అన్నారు. 

ఇలా ట్రంప్ మధ్యవర్తిత్వం పై సెటైరికల్ డైలాగ్స్ తో నెటిజన్లు హాస్యాన్ని పండించారు. ట్రంప్ ను ‘సర్దార్ డోనాల్డ్ సింగ్ ట్రంప్’’,‘‘సర్పంచ్’’ అంటూ బిరుదులిచ్చారు. 

ట్రంప్ కాల్పుల విమరణకు మధ్యవర్తిత్వం వహించచడంలో అమెరికా పాత్రను వ్యంగంగా ఎత్తిచూపారు నెటిజన్లు. ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ ఉల్లంఘించింది. కాల్పుల విరమణ న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ ధృవీకరించిన కొన్ని గంటల్లో జమ్మూకాశ్మీర్ లోని ఎల్ వోసీ వెంట పాక్ కాల్పులకు తెగబడింది. శ్రీనగర్, గుజరాత్ నుంచి గుజరాత్ లోని కచ్ వరకు పాకిస్తాన్ డ్రోన్లను భారత్ సైన్య కూల్చివేసింది.