డైలీ మెట్రో రైళ్లలో జర్నీ చేస్తున్నారా..? షాకింగ్ నిజం బయటకి.. ఏమనాలి ఇలాంటోళ్లని..!

డైలీ మెట్రో రైళ్లలో జర్నీ చేస్తున్నారా..? షాకింగ్ నిజం బయటకి.. ఏమనాలి ఇలాంటోళ్లని..!

బెంగళూరు: మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలు, యువతులు ఒకింత అప్రమత్తంగా ఉండండి. మీ కళ్లు గప్పి.. మీకు తెలియకుండానే మీ ఫొటోలను తీసి ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసే వాళ్లు మెట్రో రైళ్లలో మీ మధ్యే తిరుగుతున్నారు. అవి చూసి పైశాచిక ఆనందం పొందే జనం ఇన్స్టాగ్రాంలో ఇలాంటి చిల్లర గాళ్లకు ఫాలోవర్లుగా మారుతున్నారు. అవును.. ఇది పచ్చి నిజం. బెంగళూరు మెట్రో రైళ్లలో ప్రయాణించే అమ్మాయిలు, మహిళల ఫొటోలను వారికి తెలియకుండా తీసి ఒక ఇన్స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు. ఆ అకౌంట్ను 6 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

Bangalore Metro Clicks పేరుతో ఈ ఇన్స్టాగ్రాం అకౌంట్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఇన్స్టా పేజ్లో మొత్తం బెంగళూరు మెట్రో రైళ్లలో ప్రయాణం చేసిన యువతులు, మహిళలకు చెందిన 13 వీడియోలు పోస్ట్ అయ్యాయి. కామెంట్స్ను డిజేబుల్ చేశారు. పోస్ట్ అయిన వీడియోల్లో ఎక్కువ వీడియోలకు “finding beautiful girls on Namma Metro” అనే క్యాప్షన్తో పోస్ట్ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నీచానికి పాల్పడిన ఉన్మాదిని పట్టుకునేందుకు పోలీసులు వేట సాగిస్తు్న్నారు.

ALSO READ | నో లగేజ్ ఫుల్ కంఫర్ట్.. దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సర్వీర్, కోరిన చోటికే లగేజ్ వస్తది..

హైదరాబాద్, బెంగళూరు వంటి జన సమ్మర్థ ఎక్కువగా ఉండే నగరాల్లో పబ్లిక్ ఎక్కువగా ఎంచుకునే రవాణా సదుపాయాల్లో మెట్రో రైల్ ఒకటి. ట్రాఫిక్ తిప్పలు తప్పించుకునేందుకు, ఆఫీస్కు ఆన్ టైం వెళ్లేందుకు చాలా మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుంటారు. యువతులు, మహిళలు కూడా ఎక్కువగా మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. మెట్రో రైళ్లలో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. మెట్రో రైళ్లలో సేఫ్గా జర్నీ చేయొచ్చని, ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్న మహిళలు, యువతులకు ఇది చేదు వార్తనే చెప్పాలి. కానీ.. మెట్రో రైళ్లలో ఇలాంటి ఘటనలు వెలుగుచూడటం ఆందోళన కలిగించే విషయం.