నో లగేజ్ ఫుల్ కంఫర్ట్.. దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సర్వీర్, కోరిన చోటికే లగేజ్ వస్తది..

నో లగేజ్ ఫుల్ కంఫర్ట్.. దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సర్వీర్, కోరిన చోటికే లగేజ్ వస్తది..

ఫేమస్ అయిన డైలాగ్ ఒకటి ఉంది లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. ప్రస్తుతం దీనిని దుబాయ్ నిజరూపంలో చేసి చూపిస్తోంది. చాలా మంది వ్యాపార అవసరాలతో పాటు ట్రావెల్ కోసం ఏటా దుబాయ్ వెళుతుంటారని మనందరికీ తెలిసిందే. టూరిస్ట్ డెస్టినేషన్, ఇన్వెస్ట్మెంట్ హబ్ గా ఉన్న దుబాయ్ తన విమాన ప్రయాణికుల సౌకర్యం కోసం మతి పోగొట్టే కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ప్రయాణికులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ దిగగానే తమ లగేజీ కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే తమ పనులకు వెళ్లిపోవచ్చు. మరి లగేజీ సంగతేంటి అని ఆలోచిస్తున్నారా.. దీనికోసమే సరికొత్త లగేజ్ డోర్ డెలివరీ సేవలను దుబాయ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుందని బ్యాగేజ్ లాజిస్టిక్స్ కంపెనీ DUBZ వెల్లడించింది. దీంతో ఇకపై ప్రయాణికుల కోరిక మేరకు వారి లగేజ్ ఇంటికి లేదా హోటల్ లేదా ఆఫీస్ కి కొన్ని గంటల్లోనే చేరిపోతుంది. 

ఇక్కడ మరో క్రేజీ సర్వీస్ ఏంటంటే ప్రయాణికులు దుబాయ్ లోని వారి ఇల్లు, ఆఫీస్ లేదా హోటల్ నుంచే చెకిన్ చేయటం ద్వారా వారి లగేజీని జాగ్రత్తగా ఎయిర్ పోర్టుకు పికప్ చేస్తారు. అలాగే తిరుగు ప్రయాణంలో లగేజీ కోసం వేచిచూడకుండా ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇక్కడ కూడా మీ లగేజీని వారే కోరినచోటికి తెచ్చి అప్పగిస్తారు. ఈ క్రమంలో కావాలంటే ఎయిర్ పోర్టులోనే స్వల్ప కాలానికి దానిని స్టోరేజ్ చేసేందుకు కూడా అవకాశం కల్పించబడింది. యూఏఈలో ఎక్కడికైనా ఒక్కరోజులోనే లగేజ్ డెలివరీ సురక్షితంగా చేయబడుతుంది. 

ALSO READ | Stock Market: భారత మార్కెట్లలో ట్రిగరైన కల్లోలం.. ఫ్యూచర్ రివీల్.. ఇన్వెస్టర్లకు ఇక దేవుడే దిక్కు!

ఈ సేవలను వినియోగించుకోవటానికి ప్రయాణికులు marhabaservices.com ద్వారా బుక్ చేసుకునేందుకు వీలు కల్పించబడింది. ప్రజలు కోరుకుంటున్నట్లుగా వేగంగా రవాణా వ్యవస్థలకు కీలక మార్పులను చేస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు. చాలా మందిని విసిగించే ఎయిర్ పోర్ట్ లగేజ్ చెకిన్, లగేజ్ కలెక్షన్ ఇకపై జంజాటంగా ఉండబోదని వారు అంటున్నారు. అలాగే 2032 నాటికి సిద్ధం అవుతున్న విమానాశ్రయంలో ప్రజలు క్యూలలో నిలబడకుండా వేగంగా ప్రయాణ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావటం లగేజ్ కోసం పడిగాపులు లేకుండా చేయాలని ప్లాన్ లో దుబాయ్ బిజీగా ఉంది.