
బెంగళూరు అనగానే గుర్తుకొచ్చేది ట్రాఫిక్, కాస్ట్లీ లైఫ్, అధిక వేతనాలు.. ఐటీ కొలువులు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఈ ఇండియన్ సిలికాన్ వ్యాలీ నగరానికి చాలా ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు జాబ్ కోసం. అయితే ఈ నగరానికి ఉన్న హైప్ కి అక్కడి ప్రభుత్వ ఫెసిలిటీలకు అస్సలు మ్యాచ్ కావటం లేదు. ఇటీవల అక్కడి భాషాపరమైన, ట్రాఫిక్ పరమైన కష్టాలతో చాలా స్టార్టప్ కంపెనీల సీఈవోలు నగరాన్ని వీడి వేరే చోటికి తమ ఆఫీసులను మార్చాలని భావిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.
తాజాగా బెంగళూరులో పనిచేస్తున్న ఒక టెక్కీ తన కష్టాలను ఏకరువు పెడుతూ రెడ్డిట్ వేదికగా పోస్ట్ చేశాడు. నగరంలో చెత్త రోడ్ల గురించి చాలా కాలంగానే డిస్కషన్ జరుగుతుండగా.. అధిక పన్నుల భారం కూడా పిండేస్తోందని సదరు ఉద్యోగి చెప్పుకొచ్చాడు. తాను ఓఆర్ఆర్ ప్రాంతంలోని జేపీ నగర్ ఏరియాలో నివసిస్తున్నానని.. కేవలం ఆఫీసుకు 14 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ తనకు వెళ్లటానికి 90 నిమిషాలు రావటానికి గంటన్నర పడుతోందని చెప్పాడు. అరగంటలో వెళ్లాల్సిన ఆఫీసుకు మూడింతలు సమయం పడుతోందని చెప్పాడు.
తన వార్షిక శాలరీ ప్యాకేజీ రూ.28 లక్షలుగా ఉందని.. ఇందులో రూ.6.5 లక్షలు టాక్స్ కడుతుంటే.. రూ.1.4 లక్షలు జీఎస్టీకి ఖర్చైపోతోందని చెప్పాడు. కేవలం ప్రభుత్వానికి పన్నులు చెల్లించుకోవటానికి ఏడాదిలో మూడు నెలలు పనిచేస్తున్నామంటూ టెక్కీ వాపోయాడు. ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే ఏడాదిలో రెండున్నర నెలలు ఈ ట్రాఫిక్ జామ్స్ లో గడిపేస్తున్నట్లు వెల్లడించారు. పన్ను ఆదాయాన్ని మంచి రోడ్లు నిర్మాణానికి నగర అభివృద్ధికి వినియోగించాలని.. కానీ రోజూ ప్రయాణంలో నరకం చూస్తున్నామని టెక్కీ పోస్టులో పేర్కొన్నాడు.
ALSO READ : రూ.53వేల శాలరీతో స్టార్ట్ అయిన జర్నీ..
దీనిని చూసిన నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తూ బెంగళూరుకు బదులు టెక్కీలను ఏదైనా దేశంలో మంచి రోడ్లు, స్వచ్చమైన గాలి ఉన్న చోట పెడితే పనిని మరో 20 శాతం ప్రభావవంతంగా చేస్తారని అన్నారు. మరొకరు నగరంలో రోజురోజుకూ భారీగా పెరుగుతున్న జనాభాను నిందిస్తూ దుబాయ్ లాంటి ఇన్ ఫ్రా ఎలా స-ృష్టించగలం అంటూ స్పందించారు. ఇక నగరంలోని ఇల్లీగల్ పార్కింగ్, రద్దీ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.