
Bengaluru News: ఐటీ మహానగరంగా పేరొందిన బెంగళూరులో ఎప్పుడూ వింత అనుభవాలు ఎదురవతూనే ఉంటాయి. ఇప్పటికే మంచి వేతనాలతో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది ఖాళీ సమయాల్లో ఓలా, ఉబెర్, ర్యారిడో వంటి సైడ్ హస్టిల్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఒక మహిళా ఉద్యోగి తనకు జరిగిన వింత అనుభూతిని ఇటీవల పంచుకున్నారు.
ఇటీవల బెంగళూరులో ఒక మహిళ తన ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లటానికి ఉబెర్ లో క్యాబ్ బుక్ చేసుకుంది. అయితే కిందికి వెళ్లి కారు ఎక్కగానే షాక్ అవ్వటం ఆమె వంతైంది. ఇంతకీ ఏంటంటే తమ కంపెనీలోనే టీమ్ లీడ్ గా ఉన్న వ్యక్తి తనను పిక్ చేసుకోవటానికి క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తటం ఆమెను ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది.
Peak Bangalore moment? pic.twitter.com/9lnPOz8O1r
— purpleready (@epicnephrin_e) May 22, 2025
అయితే అసలు ఇలా ఉబెర్ ఎందుకు నడుపుతున్నారంటూ సదరు మహిళ ఆయనను ప్రశ్నించగా.. తాను ఈపని సరదాకు చేస్తున్నానని, బోర్ ఫీలింగ్ ఒంటరితనాన్ని తగ్గించుకోవటానికి ఇలా చేస్తున్నట్లు ఆమెకు బదులిచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ మ్యాటర్ ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే బెంగళూరు నగరంలో ఇలాంటి వార్తలు సర్వ సాధారణంగా మారిపోయాయి. పెద్దపెద్ద కంపెనీల్లో భారీ శాలరీలకు పనిచేస్తున్నట్లు చాలా మంది ఉద్యోగులు తమ ఖాళీ సమయంలో ఇలాంటి పనులు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
ALSO READ | మందు కొట్టి పట్టపగలు రోడ్డుపై అమ్మాయి హల్ చల్
దీనిపై కొందరు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బెంగళూరులో టైమ్ పాస్ చేయటానికి గంటల తరబడి ట్రాఫిక్ సరిపోతుందిగా అంటూ కామెంట్ చేశాడు. మరొకరు అసలు టీమ్ లీడ్ కి ఇంత ఖాళీ సమయం ఎక్కడి నుంచి వస్తోంది, ఇదేదో అనుమానంగానే ఉందని కామెంట్ చేసింది. బెంగళూరులో ఎవ్వరూ సరదాకు ఇలాంటి పనులు చేయరని, అయితే అసలు నిజం బయటకు చెప్పటం లేదు అంతే అంటూ మరొక యూజర్ దీనిపై స్పందించారు.