మందు కొట్టి పట్టపగలు రోడ్డుపై అమ్మాయి హల్ చల్

మందు కొట్టి పట్టపగలు రోడ్డుపై అమ్మాయి హల్ చల్

మద్యం సేవించి రోడ్లపై వేషాలు వేసే అబ్బాయిలు, అంకుల్స్ ను ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఫుల్లుగా తాగిన తర్వాత వాళ్ల లోపల ఉన్న మరో మనిషి బయటికొచ్చి నానా రభస చేయడం.. కొన్ని సార్లు పోలీసులకు కూడా చుక్కలు చూపించడం కామన్. అమ్మాయిలు కూడా మందు తాగి హల్ చల్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఏకంగా ఎక్కడున్నామో.. ఏ స్థితిలో ఉన్నామో కూడా తెలుసుకోలేని మైకంలో భీమవరంలో ఓ అమ్మాయి చేసిన రభస ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తూర్పు గోదావరి జిల్లా భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్ చేసింది.  ఎప్పుడు తాగిందో.. ఎక్కడ తాగిందో తెలియదు కానీ.. ఫుల్ గా తాగి రోడ్డుపైకి వచ్చి నానా రభస చేసింది. అంతే కాదు.. నన్నెవడ్రా అనేది అన్నట్లుగా రోడ్డుకు అడ్డంగా పడుకుంది. 

మద్యం మత్తులో తను ఎక్కడుందో కూడా తెలియని స్థితిలో యువతి దాదాపు 20 నిమిషాలపాటు రోడ్డుపై పడుకుంది. దీంతో భీమవరం- పాలకొల్లు ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఒకరిద్దరు లేపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 

►ALSO READ | కోర్టు ఆదేశాలు భేఖాతరు.. ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కార కేసు

మత్తులో ఉన్న అమ్మాయి ఎంత హారన్ కొట్టినా లేవక పోవడంతో చేసేదేమి లేక ఇంజిన్ ఆఫ్ చేసుకుని వెయిట్ చేశారు వాహనదారులు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువతిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.