
ముంబై: ఈ ఏడాది సెప్టెంబరు నెలలో మెర్సిడెజ్–బెంజ్ కార్ల అమ్మకాలు నూరు శాతం పెరిగాయి. దేశంలో ఈ సెప్టెంబరులో మొత్తం 4,101 లగ్జరీ కార్లను అమ్మినట్లు కంపెనీ వెల్లడించింది. జులై–సెప్టెంబర్ 2020 మధ్య కాలంలో మెర్సిడెజ్–బెంజ్ దేశీయ మార్కెట్లో 2,058 కార్లను మాత్రమే అమ్మింది. ఎకానమీ రికవరీకి ఈ సేల్స్ ఇండికేటర్‌గా నిలుస్తాయి. ఏప్రిల్–జూన్‌లో కరోనా సెకండ్‌వేవ్ ఎఫెక్ట్ వల్ల అమ్మకాలు బాగా తగ్గాయి. కానీ, 2021 క్యూ 3లో పరిస్థితులు మారాయని అమ్మకాలు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇప్పటిదాకా మొత్తం సేల్స్ 78 శాతం పెరిగి 5,007 యూనిట్లకు చేరాయని మెర్సిడెజ్–బెంజ్ తెలిపింది. చాలా కొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి తేవడంతోపాటు, కస్టమర్ల సెంటిమెంట్ బెటరవడం వల్లే అమ్మకాలు పుంజుకుంటున్నాయని పేర్కొంది. మూడో క్వార్టర్లో కస్టమర్ల నుంచి డిమాండ్ భారీగా ఉందని, ఎకానమీ రికవరీ వల్లే ఇది సాధ్యమైందని మెర్సిడెజ్–బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ స్వెంక్ చెప్పారు. రాబోయే పండగల సీజన్లోనూ అమ్మకాలు ఇదే ఊపుతో కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020లోని అమ్మకాలను ఈ ఏడాది 9 నెలల్లోనే దాటేశామని, ఫెస్టివల్ సీజన్లో మరింత మెరుగైన సేల్స్ సాధ్యమేనని అన్నారు. రాబోయే క్వార్టర్లోనూ మరిన్ని కొత్త మోడల్స్‌ను ఇండియా మార్కెట్లోకి తేనున్నట్లు మార్టిన్ వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రొడక్షన్నూ పెంచుతున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈక్యూసీ కోసం ఆర్డర్లు పెరుగుతున్నాయని, అక్టోబర్ నెలలో కొత్త బ్యాచ్ రానుందని వివరించారు.