చంద్రశేఖర్ ఆచార్యకు ఉత్తమ రక్తదాత అవార్డు

చంద్రశేఖర్ ఆచార్యకు ఉత్తమ రక్తదాత అవార్డు

నారాయణ్ ఖేడ్, వెలుగు: రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్​లో రక్త దాతల అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖేడ్​పట్టణానికి చెందిన చంద్రశేఖర్ ఆచార్య మంత్రి చేతుల మీదుగా ఉత్తమ రక్తదాత అవార్డు అందుకున్నారు.

అత్యవసర సమయంలో 52 సార్లు రక్తదానం చేయడంతోపాటు, కరోనా సమయంలో రోగులకు ప్లాస్మాను దానం చేసినందుకు రెడ్ క్రాస్ సొసైటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. చంద్రశేఖర్ కు ఈ అవార్డు రావడంపై ఖేడ్ పట్టణంలోని ప్రముఖులు ఆయనను అభినందించారు.