ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది.. దీని వల్ల చాలామంది లైఫ్ స్టైల్ మారిపోయింది. ఈ కొత్త లైఫ్ స్టైల్ వల్ల ఆరోగ్యంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ లైఫ్ స్టైల్ కు సరిగ్గా సరిపోయే కొన్ని డైట్స్ చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అట్కిన్స్ డైట్
బరువు తగ్గడానికి తినాల్సినవి, తినకూడనివి.. రెండూ ఈ డైట్లో ఉంటాయి. న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ రాబర్ట్ అట్కిన్స్ 2020 లో అందుబాటులో ఉన్న రకరకాల డైట్స్ స్టడీ చేసి వాటిలో బెస్ట్, వేస్ట్ ఫుడ్స్కు ర్యాంకింగ్స్ ఇచ్చాడు. ఇప్పుడు మన లైఫ్ స్టైల్కు ఈ డైట్ సరిగ్గా సరిపోతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ లెవెల్సు కంట్రోల్ చేస్తుంది.
ఆయుర్వేద ఆహారం
బరువు పెరగడానికి స్ట్రెస్ ఒక ముఖ్యమైన కారణం. కాబట్టి ఈ డైట్ దానిమీద కూడా ఫోకస్ చేస్తుంది. శరీరంలోని అన్నిరకాల ఎనర్జీలను బ్యాలెన్స్ చేస్తుంది. వీటితోపాటు శరీరం, మనసు రెండింటిపై దీని ప్రభావం ఉంటుంది. తీపి, పులుపు, వగరు, చేదు, కారం అన్నీ ఉంటాయి ఈ డైట్ లో.
వెజిటేరియన్ డైట్
వెజిటేరియన్ డైట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఎప్పటినుంచో అమలులో ఉన్న ఒక బెస్ట్ డైట్. ఈ టైంలో కూడా సరిగ్గా పనికొచ్చే డైట్ ఇదని నిపుణులు చెప్తున్నారు.
