ఫిట్ గా ఉండాలంటే ఇవి క్రమం తప్పకుండా తీసుకోండి..

ఫిట్ గా ఉండాలంటే ఇవి క్రమం తప్పకుండా తీసుకోండి..

వయసు పెరిగే కొద్దీ మనలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. లైఫ్ స్టైల్, ఒత్తిడి కారణంగా ఈ మధ్య కాలంలో 40ఏళ్ళు కూడా రాక ముందే చాలా మందిలో వృద్ధాప్యం కనిపిస్తోంది. నాలుగు అడుగులు వేస్తె నీరసం రావటం, అజీర్ణం, ఎసిడిటి వంటి సమస్యలు సర్వసాధారణం అయ్యి ఈ మధ్య కాలంలో. అయితే, మన ఆహార అలవాట్లలో మార్పు చేసుకుంటే వయసు మీద పడ్డాక కూడా యాక్టివ్ గా ఉండచ్చు. 40ఏళ్ళు దాటాక క్రమం తప్పకుండా ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవటం వల్ల శరీరానికి సరిపడా ప్రోటీన్స్ అంది ఎనర్జిటిక్ గా ఉంటాము.

క్రమం తప్పకుండా మజ్జిగ, పెరుగు తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వంటి సమస్యలకు దూరంగా ఉండచ్చు. ఆకు కూరలు తరచుగా తీసుకోవటం వల్ల ఐరన్, కాల్షియమ్, వంటి విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి పుష్కలంగా అంది హిమోగ్లోబిన్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగి నడి వయసులో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి తోడ్పడుతుంది.