పిల్లల మెమరీ గురించి టెన్షనా.. ? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..

పిల్లల మెమరీ గురించి టెన్షనా.. ? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..

అప్పటివరకూ పిల్లలు బాగా చదువుతారు. కానీ చదివిన దాంట్లోంచి ఒక ప్రశ్న వేస్తే కంగారు పడిపోతుంటారు. గుర్తులేదని.. సమాధానం చెబుతారు. ఇలా చాలామంది పిల్లలు అప్పుడే చదివి అప్పుడే మరిచిపోతుంటారు. దానికితోడు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్. దానివల్ల సబ్జెక్ట్స్ పై పూర్తిగా కాన్సన్ ట్రేషన్ పెట్టలేకపోతున్నారు. ప్రతీదీ మరిచిపోతున్నారు. దీంతో పిల్లల మెమెరీ విషయంలో పేరెంట్స్ మస్త్ టెన్షన్ పడుతున్నారు. కానీ పిల్లల చదువు విషయంలో పేరెంట్స్ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటే పిల్లలు మెమెరీని కోల్పోరని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్,

కొంతమంది చిన్నారులకు ఏకాగ్రత లేక పోవడంతో చదువుపై దృష్టి పెట్టరు.. వాళ్లను ఏదైతే ఆకట్టుకుంటుందో దానివైపు ఈజీగా డైవర్ట్ అవుతారు. దానివల్ల అప్పుడే చదివినా మరిచిపోతుంటారు. కానీ ఇలాంటి చిన్నారులు చదివేందుకు పేరెంట్స్ కొన్ని ట్రిక్స్ పాటించాలి. చదువుకున్నాక ఇష్టమైన ఆట ఆడిస్తాననో లేదా ఇష్టమైన ఫుడ్ ఇస్తాననో చెప్తే ఉత్సాహం గా చదువుతారు.

పజిల్ గేమ్స్

మెమెరీ ఉంటేనే పిల్లలు ఏదైనా పర్ఫెక్ట్ గా చేయగలు గుతారు. వారి స్కిల్స్ ను బయట పెట్టగలుగుతారు.. అందుకే ప్రతి చిన్నారి మెమెరీపై పేరెంట్స్ దృష్టి పెట్టాలి. దానికోసం టైం దొరికినప్పుడల్లా వాళ్లతో పజిల్ గేమ్స్ ఆడించాలి. 'పజిల్ గేమ్లో విన్ అయితే ప్రైజ్ ఇస్తాను..' అని చెప్పి వారికి చదువుపై కాన్సన్షన్ వచ్చేలా చేయాలి.

మెడిటేషన్

పిల్లల్లో ఏకాగ్రత పెంచడంలో మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా పిల్లలు మెడి టేషన్ చేస్తే కాన్సన్ ట్రేషన్ పెరుగుతుంది. హైపర్ పిల్లలకు మెడిటేషన్ బెస్ట్ మెడిసిన్. రోజూ ఉదయం అరగంటపాటు మెడిటేషన్ చేస్తే నిదానంగా ఉంటారు. ఏ విషయాన్నయినా కూల్ గా ఆలోచి స్తారు. చదువుతో పాటు ఆటలు, కళలపై కూడా దృష్టిపెడతారు.

ఎక్సర్సైజ్

పిల్లలకు మైండ్ బలంగా ఉండటం ఎంత అవస రమో శరీరం కూడా బలంగా ఉండటం అంతే అవసరం. అప్పుడే పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ప్రతిరోజు ఉదయం చిన్న చిన్న వర్క్ అవుట్స్ చేయడం వల్ల పిల్లలు ఫిజికల్ గా బలంగా తయార వుతారు. దీనివల్ల మైండ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది.ఉదయాన్నే చేసే వ్యాయామం వల్ల పిల్లలు రోజంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటారు.

నెమ్మదిగా నేర్పుతుంటే..

పిల్లలకు సరిగా గుర్తుండటం లేదని పేరెంట్స్ కోపం తెచ్చుకోకూడదు. అలాగే వాళ్లను వదిలేయ కూడదు. నెమ్మది నెమ్మదిగా చెప్పాల్సిన బాధ్యత పేరెంటే. విసుక్కోకుండా, కోపం పడకుండా వాళ్లకి అన్నీ వివరించాలి. అప్పుడే మరిచిపోకుండా ఉంటారు. అలాగే చదువుతున్నప్పుడు పిల్లలకు డౌట్స్ వస్తే అప్పటికప్పుడు క్లారిఫై చేయడం కూడా మంచిది. ఇలా చేస్తే పిల్లల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది.

ప్రాక్టికల్ గా

కొంతమంది పిల్లలకు బుక్స్ చదవంగానే అర్థమవుతుంది. మరికొంతమంది పిల్లలకు ప్రాక్టికల్గా చెబితే అర్థమవుతుంది. అందుకే పేరెంట్స్.. పిల్లలకు ఏ విధంగా చెబితే అర్థం అవుతుందో గుర్తించి వాళ్లకు అలా చెప్పాలి. ఒకవేళ పిల్లలకు ఇండియా మ్యాప్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వారితో ఆ మ్యాప్ డ్రా చేయించాలి. ఆ మ్యాప్ కు వాళ్లతో ఇష్టమైన కలర్ వేయించాలి. ఇలా చేస్తే పిల్లలకు ఇండియా మ్యాప్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ రంగులో ఉండే ఇండియానే గుర్తుకొస్తుంది.

పర్సనల్ కేర్

పిల్లల మెమెరీని పెంచాలనుకుంటే వాళ్లతో పేరెంట్స్ ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి. వాళ్లు ఆడుతున్నా.. టీవీ చూస్తున్నావాళ్లతోపాటే
అవేర్నెస్ ఉండాలి. ఇలా పక్కనున్న టైంలోనే పిల్లలకు ప్రాక్టి కల్ గా కొన్ని విషయాలు నేర్పించొచ్చు. దీనివల్ల పిల్లలు మరింత కాన్సన్ట్రేషన్ తో వింటారు.

న్యూట్రిషన్

పిల్లలు తినే పుడ్ని బట్టి కూడా వాళ్ళ మెమెరీ ఆధార పడి ఉంటుంది. సరైన టైంలో హెల్దీ ఫుడ్ తినడం వల్ల పిల్లలు మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు. పండ్లు, కూరగాయల్లో దొరికే ఫ్లేవనాయిడ్లు, ఒమేగా త్రీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఫుడ్ తినడం వల్ల పిల్లల మెమెరీ పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్ల లు ఎట్టిపరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయకూడ దు. డైలీ ఉదయాన్నే బలాన్నిచ్చే ఫుడ్ తినడం వల్ల పిల్లలు హెల్దీగా.. యాక్టివ్గా ఉంటారు.