రూల్స్ పాటించని లోన్ యాప్స్ బ్యాన్

రూల్స్ పాటించని లోన్ యాప్స్ బ్యాన్

న్యూఢిల్లీ: తమ ఇండియా ప్లే స్టోర్ నుంచి జనవరి–జులై మధ్య కాలంలో మొత్తం 2 వేల పర్సనల్​ లోన్​ యాప్స్​ను బ్లాక్​చేసినట్లు గుగుల్​ ప్రకటించింది. రూల్స్​ను పాటించకపోవడం వల్లే ఈ యాప్స్​ను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. చాలా లోన్​ యాప్స్​ను తొలగించామని, ఇందులో 50 శాతం యాప్స్​ రూల్స్​ను పాటించడం లేదని గుగుల్​ ఏషియా–పసిఫిక్​ హెడ్​ (ట్రస్ట్​ అండ్ సేఫ్టీ) సైకత్​ మిత్రా చెప్పారు. మోసపూరిత యాప్స్​ను తొలగించడంలో గవర్నమెంట్​ సహా అందరు స్టేక్​హోల్డర్లతోనూ కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండోనేషియా దేశంలో యాప్స్​ను ఏరివేయడం ఈజీ అని చెప్పారు.